Relief to Vangalapudi Anitha: వంగలపూడి అనితకు హైకోర్టులో ఊరట.. తొందరపాటు చర్యలొద్దని ఆదేశం - High Court on Vangalapudi Anitha Petition
High Court on Vangalapudi Anitha Petition: టీడీపీ మహిళా నేత వంగలపూడి అనితకు హైకోర్టులో ఊరట లభించింది. సోషల్ మీడియాలో మహిళలపై అసభ్యకరంగా పోస్టులు పెట్టిన వ్యక్తి ఇంటి ముందు ఆందోళన చేపట్టినందుకు గాను అనితపై కేసు నమోదైంది. దీంతో ఆమెపై నమోదైన కేసులో తొందరపాటు చర్యలు తీసుకోవద్దని పోలీసులను న్యాయస్థానం ఆదేశించింది. 41 సీఆర్‌పీసీ ప్రకారం నోటీసులు ఇచ్చి విచారించాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. తనపై అసభ్యకర పోస్టులు పెట్టారని ఎన్టీఆర్ జిల్లా నందిగామకు చెందిన సజ్జనరావు ఇంటి ముందు తెలుగు మహిళా అధ్యక్షురాలు వంగలపూడి అనిత గతంలో ఆందోళన నిర్వహించారు. దీంతో పోలీసులు అనితపై నాన్ బెయిలబుల్ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. కేసుపై అనిత హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. అన్యాయంగా పిటిషనర్‌పై కేసు నమోదు చేశారని పిటిషనర్ తరపు న్యాయవాది వీవీ సతీష్ వాదనలు వినిపించారు. వాదనలు విన్న న్యాయస్థానం పిటిషనర్‌పై తొందరపాటు చర్యలు తీసుకోవద్దని పోలీసులను ఆదేశించింది.