Young Man రిపేర్ కోసం ఫోన్ ఇస్తే.. ప్రేమించాలంటూ వేధించాడు.. దేహశుద్ధి చేసిన యువతి బంధువులు - ఏపీ తాజా వార్తలు
Young Woman Relatives Beaten Young Man ఆ యువతి ఫోన్ రిపేర్కు వచ్చింది. దానిని బాగు చేయించుకోవడానికి దగ్గరిలోని మొబైల్ షాపుకు వెళ్లింది. అయితే ఆ షాపు ఓనర్ దీనినే అలుసుగా తీసుకుని అక్కడకు వచ్చిన ఆ యువతి నెంబర్ తీసుకుని తనను ప్రేమించాలంటూ వేధించాడు. ఈ ఘటన అనంతపురం జిల్లాలో జరిగింది.
అనంతపురం జిల్లా రాయదుర్గంలో ప్రేమ పేరుతో వేధిస్తున్న యువకుడికి యువతి బంధువులు దేహశుద్ధి చేశారు. దాదాపీర్ అనే యువకుడు ఫోన్ రిపేర్ కోసం వచ్చిన యువతి ఫోన్ నంబర్ తీసుకుని.. ప్రేమిస్తున్నానని గత రెండు నెలలుగా వేధిస్తున్నాడు. దీంతో విషయం తెలుసుకుని కుటుంబ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. యువతి, బంధువులు కలిసి దుకాణం వద్దకు వచ్చి యువకుడికి దేహశుద్ధి చేశారు. తర్వాత పోలీసులకు అప్పగించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం యువకుడికి దేహశుద్ధి చేసిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.