The female MPP tears : 'ఎమ్మెల్యే నుంచి మాకు ప్రాణహాని..' ఎస్టీ మహిళా ఎంపీపీ కంటతడి - women MPP
The female MP tears : కాకినాడ జిల్లా ప్రత్తిపాడు ఎమ్మెల్యే పర్వత పూర్ణచంద్ర ప్రసాద్ అనుచరులు తన భర్త, తనపై దాడి చేశారంటూ రౌతులపూడి ఎంపీపీ రాజ్యలక్ష్మి ఆరోపించారు. మమ్మల్ని చంపమని.. ఎమ్మెల్యే అనుచరులు జేరేటి శ్రీను, ఆయన భార్య రమణమ్మ, అల్లు సాయి అనే మరో అనుచరుడిని పంపించారని తెలిపారు. మా కుటుంబానికి ఎమ్మెల్యే నుంచి ప్రాణహాని ఉందని ఎంపీపీ కన్నీటి పర్యంతమయ్యారు. ఎస్టీ వర్గానికి చెందిన తనను నీచంగా మాట్లాడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. దాడికి సంబంధించి ఎంపీపీ రాజలక్ష్మి వీడియో విడుదల చేశారు. ఎమ్మెల్యే, అధికారులు ప్రోటోకాల్ పాటించడం లేదంటూ నిన్న కాకినాడలో నిర్వహించిన స్పందనలో జేసీకి రాజ్యలక్ష్మి ఫిర్యాదు చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ తాను ఎదుర్కొంటున్న సమస్యలను వివరించారు. ఈ క్రమంలోనే దాడికి పాల్పడ్డారని ఎంపీపీ తెలిపారు. ఎమ్మెల్యే, ఆయన అనుచరుల బారి నుంచి తమ కుటుంబానికి రక్షణ కల్పించాలని రాజ్యలక్ష్మి విజ్ఞప్తి చేశారు. ఈ వ్యవహారంపై కాకినాడ ఎస్పీకి ఫిర్యాదు చేయనున్నట్టు రాజ్యలక్ష్మి తెలిపారు. ప్రొటోకాల్ పాటించడం లేదంటూ గత నెల 9న కలెక్టర్ కు ఫిర్యాదు చేసినా ఎలాంటి విచారణ జరిపించలేదని.. నిన్న మరోసారి ఫిర్యాదు సందర్భంగా రాజ్యలక్ష్మి మీడియాకు తెలిపారు.