Minister Karumuri Press Meet : రాష్ట్రంలో ఏ ఒక్క రేషన్ డీలర్‌ను తొలగించే ప్రసక్తే లేదు : మంత్రి కారుమూరి - karumuri sensational comments
Ration Dealers Meet Minister Karumuri :రేషన్ డీలర్లను తొలగిస్తున్నారని చేస్తున్న ప్రచారంలో నిజం లేదని ఏపీ పౌరసరఫరాల శాఖ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు స్పష్టం చేశారు. ప్రజలకు చౌక డిపోల ద్వారా మరిన్ని సేవలు అందించేందుకు త్వరలో గ్రామాల్లో గోడౌన్, షాపు కలిసి వచ్చేలా నిర్మాణాలు చేపడతామని మంత్రి కారుమూరి తెలిపారు. విజయవాడలో ఆయన మీడియాతో మాట్లాడుతూ తాము రేషన్ డీలర్లను తొలగిస్తున్నామని విపక్షాలు ప్రచారం చేస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు.
రాష్ట్రంలో ఏ ఒక్క రేషన్ డీలర్‌ను తొలగించే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. కమాండ్ కంట్రోల్ రూమ్ ద్వారా రాష్ట్రంలో ధరల పెరుగుదలను ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేస్తున్నామని, రాష్ట్రంలో ఏ మారుమూల గ్రామంలో సరుకులు రేట్లు పెంచినా చర్యలు తీసుకుంటామన్నారు. పోర్టుపైడ్ రైస్‌లో ప్లాస్టిక్ రైస్ కలుస్తుందనేది చాలా మంది అపోహపడుతున్నారని తెలిపారు. ఇందులో వాస్తవం లేదన్నారు. వచ్చే నెల నుంచి చౌక డిపోల ద్వారా ప్రజలకు కందిపప్పు ఇచ్చేందుకు చర్యలు చేపడతున్నట్లు వివరించారు. ప్రస్తుతం డీలర్లకు 1 రూపాయి కమిషన్ ఇస్తున్నామని, సీఎం జగన్‌తో మాట్లాడి కమిషన్ పెంచేందుకు కృషి చేస్తామని డీలర్లకు భరోసా ఇచ్చారు.