ఆంధ్రప్రదేశ్

andhra pradesh

రాష్ట్రీయ ఉపాధ్యాయ పండిత్ పరిషత్ ధర్నా

ETV Bharat / videos

Teachers Protest In kurnool: సమస్యలు పరిష్కరించాలని.. భాషా పండితుల ఆందోళన

By

Published : Jun 3, 2023, 8:12 PM IST

Rashtriya Upadhyaya Pandit Parishad dharna : భాషా పండితుల పట్ల రాష్ట్ర ప్రభుత్వం మొండి వైఖరిని ప్రదర్శిస్తుందని రాష్ట్రీయ ఉపాధ్యాయ పండిత్ పరిషత్ నాయకులు కర్నూలులో ఆందోళన  చేపట్టారు. రెండు సంవత్సరాలుగా భాషా పండితులు బదిలీల కోసం ఎదురుచూస్తున్నా.. సమస్య పరిష్కారం కావడం లేదని వారు కర్నూలు డీఈఓ కార్యాలయం ముందు బైఠాయించి నిరసన తెలిపారు. కర్నూలు జిల్లాలో తెలుగు, హిందీ, పీఈటీ ఉపాధ్యాయుల ఖాళీలు ఉన్న వాటిని అధికారులు బ్లాక్ చేశారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రీయ ఉపాధ్యాయ పండిత్ పరిషత్ కర్నూలు జిల్లా అధ్యక్షులు రఘు మాట్లాడుతూ.. 2001వ సంవత్సరంలో కూడా తెలుగు, హిందీ ఉపాధ్యాయు​లకు తీవ్రమైన నష్టం చేయటం జరిగిందని తెలిపారు. జిల్లాలో, రాష్ట్రంలో ఉన్న అన్నీ ప్రధాన ఉపాధ్యాయ సంఘాలకి తమ సమస్యలను విన్నవించామని, లేఖలు ఇచ్చామని అన్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా అధికారులు స్పందించి తమ సమస్యలు పరిష్కరించాలని, తనకు న్యాయం చేయాలని ఆయన అధికారులను కోరారు.

ABOUT THE AUTHOR

...view details