ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ఎమ్మెల్యేపై నేషనల్ కమిషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్ ఫిర్యాదు

ETV Bharat / videos

Complaint to NCPCR: జాతీయ పిల్లల హక్కుల పరిరక్షణ కమిషన్​కు ఎమ్మెల్యేపై ఫిర్యాదు - AP Political News

By

Published : Jul 7, 2023, 8:19 PM IST

National Commission for Protection of Child Rights on Childrens Washed MLA Feet : తూర్పు గోదావరి జిల్లా అనపర్తి ఎమ్మెల్యే సత్తి సూర్యనారాయణ రెడ్డి.. మహిళలు, చిన్నారులతో కాళ్లు కడిగించుకోవడం చర్చనీయాంశమైంది. ఈ వీడియో సోషల్​ మీడియాలో వైరల్​ అయ్యింది. పెదపూడి మండలం రామేశ్వరంలో జూన్ 30వ తేదీన రాత్రి నిర్వహించిన గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా ఓ నివాసానికి ఎమ్మెల్యే వెళ్లారు. అక్కడి మహిళలు, చిన్నారులు ఆయన కాళ్లను చేతులతో కడిగి.. వస్త్రంతో తుడిచారు. దీనిపై విమర్శలు వర్షం కురుస్తోంది.

అనపర్తి ఎమ్మెల్యే సత్తి సూర్యనారాయణ రెడ్డి బాలికలు, మహిళలతో కాళ్లు కడిగించుకోవటంపై మాజీ ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి జాతీయ పిల్లల హక్కుల పరిరక్షణ కమిషన్ (NCPCR)కు లేఖ ద్వారా ఫిర్యాదు చేశారు. అనపర్తిలో కొత్త దేవుడు ఉద్భవించి పాద పూజలు చేయించుకుంటున్నారని రామకృష్ణారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే తన పబ్లిసిటీ కోసమే ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నారన్నారు. ఈ ఘటనపై ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి స్పందించాలని ఆయన అన్నారు. బాలికలకు, మహిళలకు ఎమ్మెల్యే సూర్యనారాయణ రెడ్డి క్షమాపణ చెప్పాలని, అలాగే వారి కాళ్లు కడగాలని ఆయన డిమాండ్‌ చేశారు.

ABOUT THE AUTHOR

...view details