ఆంధ్రప్రదేశ్

andhra pradesh

Ramachandra Reddy Said No Enemies in Politics Only Opponents

ETV Bharat / videos

రాజకీయాల్లో ప్రత్యర్థులు తప్ప శత్రువులు ఉండరు: రామచంద్రారెడ్డి - వైఎస్సార్సీపీ పార్టీ

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jan 12, 2024, 12:00 PM IST

Ramachandra Reddy Said No Enemies in Politics Only Opponents: రాజకీయాల్లో ఎవరు శత్రువులు ఉండరని కేవలం ప్రత్యర్థులు మాత్రమే ఉంటారని అనంతపురం జిల్లా రాయదుర్గం ఎమ్మెల్యే రామచంద్రారెడ్డి అన్నారు. రాయదుర్గం పట్టణంలోని ఆయన స్వగృహంలో బుధవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఇష్టాగోష్టిగా మాట్లాడారు. ఎమ్మెల్యేకు ప్రత్యర్థులైన వారు మున్సిపల్ కౌన్సిలర్లకు, గ్రామ సర్పంచులు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలకు డబ్బులు ఇచ్చేందుకు గాలం వేస్తున్నారని ఆయన పేర్కొన్నారు. కళ్యాణదుర్గం నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా పోటీ చేస్తానని వెల్లడించారు. రాయదుర్గంలో నా కుటుంబ సభ్యులు పోటీ చేస్తారని రామచంద్రారెడ్డి ప్రకటించారు.

వైసీపీ టికెట్ కోసం ఆశించే వాళ్లు నాపై దుష్ప్రచారం చేయటం తగదన్నారు. ఎవరు అవకాశం కల్పిస్తే వారితో కలిసి ముందుకు వెళ్తానన్నారు. పీసీసీ మాజీ అధ్యక్షుడు ఎన్. రఘువీరారెడ్డి నాకు గురువు అని వివరించారు. మాజీ మంత్రి కాల్వ శ్రీనివాసులు నా శత్రువు కాదని కేవలం రాజకీయ ప్రత్యర్థి మాత్రమే అని ఆయన స్పష్టం చేశారు. రాయదుర్గం వదిలిపెట్టి వెళ్ళనని తమ కార్యకర్తలు, నాయకులు జోలికి ఎవరైనా వస్తే సరైన సమయంలో గుణపాఠం చెబుతానని ఆయన పేర్కొన్నారు.

ABOUT THE AUTHOR

...view details