ఆంధ్రప్రదేశ్

andhra pradesh

Rajamahendravaram_Police_Caught_the_Bike_Thief

ETV Bharat / videos

పార్కింగ్ బైక్​ల అపహరణ - దొంగను వలపన్ని పట్టుకున్న పోలీసులు - Bike thefts in AP

By ETV Bharat Andhra Pradesh Team

Published : Nov 22, 2023, 6:51 PM IST

Rajamahendravaram  Police Caught the Bike Thief :పార్కింగ్ చేసి ఉన్న ద్విచక్ర వాహనాలను అపహరించే దొంగను రాజమహేంద్రవరం టూ టౌన్ పోలీసులు పట్టుకున్నారు. అతడి నుంచి 24 బైక్ లు స్వాధీనం చేసుకున్నారు. కోనసీమ జిల్లా కపిళేశ్వరపురం మండలానికి చెందిన బెనర్జీ అనే వ్యక్తి రాజమహేంద్రవరం నగరంతోపాటు.. కోనసీమ జిల్లాలోనూ బైక్ లు దొంగిలించాడు. టూ టౌన్ పోలీసులు ఇతన్ని వలపన్ని పట్టుకుని అరెస్టు చేసినట్లు.. తూర్పు గోదావరి జిల్లా ఎస్పీ జగదీశ్ మీడియాకు వివరాలు వెల్లడించారు.  

మరో ఘటనలో..  ఇటీవల ఎమ్మెల్సీ ఇంటి ముందు పార్కింగ్ చేసిన వాహనాన్ని ఓ దుండగుడు చోరీ చేశాడు. అది కూడా మరెవరిదో కాదు ఆ ఎమ్మెల్సీ గన్​మెన్​దే. ఈ ఘటన పశ్చిమగోదావరి జిల్లా తణుకులో చోటుచేసుకుంది. పశ్చిమగోదావరి జిల్లా తణుకులో ఎమ్మెల్సీ  వంకా రవీంద్రనాథ్.. గన్​మెన్​ ద్విచక్ర వాహనాన్ని గుర్తు తెలియని వ్యక్తి పట్టపగలే అపహరించుకు పోయాడు. అది కూడా ఎమ్మెల్సీ ఇంటి ముందు ఉంచిన బైక్​ దొంగతనం జరగడంపై.. పలు రకాలుగా కామెంట్లు వస్తున్నాయి.

ABOUT THE AUTHOR

...view details