ఆంధ్రప్రదేశ్

andhra pradesh

Two_More_Days_of_Rain_in_AP_and_Telangana

ETV Bharat / videos

Rains in Andhra Pradesh: రాష్ట్రంలో మరో రెండు రోజులు వర్షాలు: వాతావరణ శాఖ

By ETV Bharat Andhra Pradesh Team

Published : Sep 5, 2023, 7:07 PM IST

Rains in Andhra Pradesh: రెండు తెలుగు రాష్ట్రాల్లో గత మూడు రోజులుగా ఏకధాటిగా వర్షాలు కురుస్తున్న విషయం తెలిసిందే. వర్షాల కారణంగా గ్రామాల్లో వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. మరోవైపు పట్టణాల్లో వర్షాల కారణంగా జనజీవనం స్తంభించిపోయింది. కాలనీలు నీటమునిగి, డ్రైనేజీలు పొంగి పొర్లుతున్నాయి. దీంతోపాటు రోడ్లన్నీ వర్షపు నీటితో కాలువల్లా మారాయి. ఈ నేపథ్యంలో భారత వాతావరణ శాఖ విభాగం ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాలకు ముఖ్యమైన సమాచారాన్ని తెలియచేసింది. 

Telugu States Latest Weather Reports: ''వాయువ్య-పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో కోస్తాంధ్ర తీరంపై అల్పపీడన ప్రాంతం ఏర్పడింది. అల్పపీడన ప్రాంతం నుంచి తెలంగాణాపై మరో ఉపరితల ఆవర్తనం పొంచి ఉంది. హిమాలయాల నుంచి వారణాసి-అంబికాపూర్‌ల మీదుగా ఝార్సు గూడా వరకూ నైరుతీ రుతుపవనాలు క్రియాశీలం కాగా మారాయి. వీటి ప్రభావంతో కోస్తాంధ్ర, తెలంగాణా జిల్లాల్లో కొన్ని చోట్ల భారీ వర్షాలు కురిసే సూచనలు ఉన్నాయి. అల్పపీడన ప్రాంతం ప్రభావంతో రాగల రెండు రోజుల పాటు కోస్తాంధ్ర, రాయలసీ జిల్లాలు, తెలంగాణా, తమిళనాడు, కేరళ, మహారాష్ట్ర, కర్ణాటల్లోనూ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే సూచనలు ఉన్నాయి. కొన్నిచోట్ల పిడుగులు, ఉరుములతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈనెల 7తేదీ వరకూ ఏపీ, తెలంగాణాల్లో చాలా చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది'' అని వాతావరణ శాఖ విభాగం వివరాలను వెల్లడించింది. 

ABOUT THE AUTHOR

...view details