ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ఏపీలో రుతుపవనాలు ఆలస్యం

ETV Bharat / videos

Monsoon delayed in AP: ఆలస్యమవుతున్న వర్షాలపై.. వ్యవసాయ శాస్త్రవేత్తల సూచనలేంటీ..? - ప్రత్యామ్నాయ పంటలు

By

Published : Jul 16, 2023, 5:55 PM IST

Monsoon delayed in Andhra Pradesh: రానున్న వారం రోజుల్లో వర్షాలు పడే అవకాశం తక్కువగా ఉందని వ్యవసాయ, వాతావరణ శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. ఎల్నినో ప్రభావం కారణంగా ఈసారి నైరుతి రుతుపవనాలు ఆలస్యంగా రావటం, ఒకే చోట వారం రోజులపాటు స్థిరంగా నిలిచిపోయిన కారణంగా ఖరీఫ్ సాగు ఆలస్యమైంది. రాష్ట్రంలో నెల రోజులు వర్షాలు ఆలస్యమయ్యాయి. ప్రస్తుతం రాష్ట్రంలో దుర్భిక్ష పరిస్థితులు నెలకొన్నాయి. 26 జిల్లాలకు గాను.. మొత్తం 13 జిల్లాలలో లోటు వర్షపాతం ఉంది. 10 జిల్లాల్లో సాధారణ, 2 జిల్లాల్లో అధిక వర్షపాతం ఉంది. రాష్ట్రంలో 23 శాతం లోటు వర్షపాతం నమోదు అయింది. రాయలసీమ జిల్లాల్లో 30 శాతం లోటు వర్షపాతం కొనసాగుతోంది. వచ్చే వారం రోజుల్లో రాయలసీమ జిల్లాల్లో వర్షాలు కురిసే పరిస్థితులు కనిపించటంలేదు. వేరుసెనగ పంట సాగుకు అదునుదాటిపోయింది. ఇక ఈ పంట వేయకపోవటమే మంచిదని శాస్త్రవేత్తలు అభిప్రాయపడుతున్నారు. ప్రత్యామ్నాయ పంటలు వేయాలని సూచిస్తున్నారు. అనంతపురం జిల్లా రేకులకుంట వ్యవసాయ పరిశోధన స్థానం.. మెట్ట వ్యవసాయ ప్రధాన శాస్త్రవేత్త, వాతావరణ శాస్త్రవేత్తలతో ముఖాముఖి.

ABOUT THE AUTHOR

...view details