Railway Police Saves Passenger: కదులుతున్న రైలు నుంచి దిగుతూ.. ప్రయాణికురాలిని కాపాడిన రైల్వే పోలీస్ - Railway Police Saves Woman
Railway Police Saves Passenger: తిరువతి రైల్వే స్టేషన్లో ఓ మహిళ ప్రమాదం నుంచి బయటపడింది. రైల్లో నుంచి కింద పడుతున్న మహిళను రైల్వే రక్షక దళం (ఆర్పీఎఫ్) సిబ్బంది కాపాడారు. తిరుపతి రైల్వేస్టేష్‌లో ఉదయం ఐదున్నర గంటల సమయంలో, తమిళనాడు రాష్ట్రానికి చెందిన గోకిల కరుణానిధి అనే మహిళా ఒకటో నంబరు ప్లాట్ ఫాంపై ఆగి ఉన్న రైలు ఎక్కారు. సదరు మహిళ సేలం వెళ్లాల్సిన రైలు ఎక్కాల్సి ఉండగా.. పొరపాటున వేరే రైలు ఎక్కినట్లు గుర్తించారు.
దీంతో అప్పటికే ఆవిడ ఎక్కిన రైలు ప్లాట్ ఫామ్‌పై వేగాన్ని పెంచడంతో ఆమె దిగేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో ప్రమాదానికి గురవుతున్న మహిళను గుర్తించిన ఆర్పీఎఫ్ ఎస్కార్ట్ సిబ్బంది సురక్షితంగా కాపాడారు. విధుల్లో చాకచక్యంగా వ్యవహరించి.. ప్రయాణికురాలిని ఎటువంటి గాయాలు లేకుండా కాపాడిన ఎస్కార్ట్ సిబ్బందిను ఆర్పీఎఫ్ తిరుపతి ఇన్స్పెక్టర్ మధుసూదన్ అభినందించారు. ఈ మేరకు సీసీటీవీ ఫుటేజ్‌ను మీడియాకు విడుదల చేశారు.