ఆంధ్రప్రదేశ్

andhra pradesh

Huge_ python_ in_ Tirumala

ETV Bharat / videos

python in Tirumala : తిరుమలలో భారీ కొండచిలువ.. భయాందోళనకు గురైన స్థానికులు - పాము వైరల్ వీడియో

By ETV Bharat Andhra Pradesh Team

Published : Sep 30, 2023, 10:38 AM IST

python in Tirumala :తిరుమలలో భారీ కొండచిలువ హాల్ చల్ చేసింది.. స్థానికులు నివాసముండే బాలాజీ నగర్​లో ఓ ఇంటి ముందు 12 అడుగుల కొండచిలువ నక్కింది. పామును చూసిన ఇంటి యజమానులు, స్థానికులు భయాందోళనకు గురయ్యారు. దీంతో అటవీశాఖ ఉద్యోగికి సమాచారం ఇచ్చారు. హుటాహుటిన అక్కడ చేరుకొన్న అటవీశాఖ ఉద్యోగి చాకచక్యంగా కొండచిలువను పట్టుకొని సమీప అటవీ ప్రాంతంలో వదిలివేశారు.  

Snake In the Bank: అల్లూరి సీతారామరాజు జిల్లా కేంద్రం పాడేరు స్టేట్ బ్యాంక్​లో పాము కలకలం రేపింది. మధ్యాహ్నం బ్యాంకు పైన టాయిలెట్ రూమ్​లో పాము ప్రత్యక్షమైంది. ఒక్కసారిగా భయభ్రాంతులకు గురైన స్థానికులు స్నేక్ క్యాచర్​కు సమాచారం అందించారు. అలాగే చింతలవీధిలో ఓ ఇంట్లో మరో పాము కనిపించింది. ఈ రెండిటిని స్నేక్ క్యాచర్  పట్టుకుని సురక్షితంగా అటవీ ప్రాంతంలో వదిలిపెట్టాడు. వర్షాలు ఎక్కువ కావడం వల్ల పాములు బయటకు వస్తున్నాయని, రాత్రి వేళల్లో తగి జాగ్రత్తలు తీసుకోవాలని అటవీశాఖ వారు సూచిస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details