ఆంధ్రప్రదేశ్

andhra pradesh

Python_Halchal_in_Guntur_Dist

ETV Bharat / videos

Python Halchal in Mangalagiri: మంగళగిరిలో కొండచిలువ హల్​చల్​.. డ్రైనేజీలో ఉండగా చూసి.. - మంగళగిరి తాజా వార్తలు

By ETV Bharat Andhra Pradesh Team

Published : Oct 16, 2023, 2:28 PM IST

Python Halchal in Guntur District: గుంటూరు జిల్లాలో ఓ కొండ చిలువ హల్​చల్​ సృష్టించింది. జిల్లాలోని ఓ డ్రైనేజీ కాలువలో కొండచిలువ కనిపించడం అక్కడ ఉన్న స్థానికులతో పాటు ఆ రహదారిపై వెళ్లే ప్రయాణికులు కూడా తీవ్ర భయాందోళనకు గురయ్యారు. అసలేం జరిగిందటే.. గుంటూరు జిల్లా మంగళగిరి సమీపంలోని ఆత్మకూరు వద్ద గల ఓ సర్వీస్ రోడ్డు పక్కన ఉన్న మురికి కాలువలో ఓ కొండ చిలువ ఉండటాన్ని ఆ రహదారి వెంట వెళ్లే వారు గమనించారు. డ్రైనేజీలో  కొండ చిలువ ఉన్న విషయం తెలుసుకున్న  స్థానికులు దానిని చూసేందుకు అక్కడికి పెద్ద ఎత్తున తరలి వచ్చారు. ఆ సమయంలో ఆ కొండ చిలువ ఏదో జంతువుని తిని ఉందని స్థానికులు తెలిపారు. దీనిపై అప్రమత్తమైన స్థాని కులు మురికి కాలువలో ఉన్న ఆ కొండ చిలువను అందులో నుంచి బయటకు తీశారు. అనంతరం స్థానికులు దానిని కొట్టి చంపేశారు.  

ABOUT THE AUTHOR

...view details