'ఒత్తిడిని తట్టుకుని సింధు అద్భుతంగా ఆడింది.. తల్లిదండ్రులుగా గర్వపడుతున్నాం' - PV Sindhu Parents
PV Sindhu Parents: 12 ఏళ్లుగా అత్యుత్తమ ప్రతిభ కనబరుస్తుందంటే ఆట పట్ల సింధుకు ఉన్న నిబద్ధత ఏలాంటిదో అర్థం చేసుకోవచ్చని ఆమె తండ్రి రమణ అన్నారు. కామన్వెల్త్ గేమ్స్‌లో సింధు పసిడి పతకాన్ని గెలవడం పట్ల తల్లిదండ్రులు ఆనందం వ్యక్తం చేశారు. కామన్వెల్త్లో స్వర్ణం సాధించాలన్న తన కల నెరవేరిందని ఆయన తెలిపారు. ఒత్తిడిని తట్టుకుని చాలా అద్భుతంగా ఆడిందని ఆయన తెలిపారు. ఒక తండ్రిగా చాలా గర్వపడుతున్నానని.. సింధు బంగారు పతకం సాధించడం చాలా సంతోషంగా ఉందని సింధు తల్లి విజయ అన్నారు. రెండు రోజులుగా కాలు నొప్పి ఉందని చెప్పిందని.. కానీ చాలా బాగా ఆడిందని ఆమె తల్లిదండ్రులు తెలిపారు.
Last Updated : Feb 3, 2023, 8:26 PM IST