ఆంధ్రప్రదేశ్

andhra pradesh

వైభవంగా తిరుమల శ్రీవారి పుష్ప పల్లకీ సేవ.. భారీ సంఖ్యలో పాల్గొన్న భక్తులు

ETV Bharat / videos

Pushpa Pallaki Seva: వైభవంగా తిరుమల శ్రీవారి పుష్ప పల్లకీ సేవ.. భారీగా పాల్గొన్న భక్తులు - AP Latest News

By

Published : Jul 17, 2023, 10:49 PM IST

Pushpa Pallaki Seva was organized by TTD in Tirumala: తిరుమలలో పుష్పపల్లకీ సేవను తితిదే వైభవంగా నిర్వహించింది. శ్రీవారి ఆలయంలో సోమవారం సాయంత్రం సాలకట్ల ఆణివార ఆస్థానం సందర్భంగా భాగంగా శ్రీదేవీ భూదేవి సమేత మలయప్ప స్వామి వారు శోభాయమానంగా అలంకరించిన పుష్ప పల్లకిపై దర్శనమిచ్చారు. వివిధ రకాల పుష్పాలతో సర్వాంగ సుందరంగా అలంకరించిన పల్లకిపై శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామివారు ఆలయ నాలుగు మాడ వీధుల్లో భక్తులకు అభయమిచ్చారు. పల్లకీ మందుభాగంలో శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ వేంకటేశ్వర స్వామి, పక్క భాగంలో ద్వాపరయుగంలో చిన్నికృష్ణులు, వెనక భాగంలో తమలపాకుల ప్రత్యేక అలంకరణలో హనుమంతుని ప్రతిమలను కొలువుదీర్చారు. 6 రకాల సంప్రదాయ పుష్పాలు, 6 రకాల కట్ ఫ్లవర్స్ కలిపి మొత్తం ఒక టన్ను పుష్పాలు వినియోగించారు. ఈ ఉత్సవంలో శ్రీవారిని చూడటానికి భక్తలు పెద్ద సంఖ్యలో ఆలయానికి వచ్చారు. శ్రీవారి పుష్పపల్లకి సేవ వైభవంగా జరగగా.. కార్యక్రమంలో తితిదే ఈవో ఏవీ ధర్మారెడ్డి, బోర్డు సభ్యులు, అధికారులు పాల్గొన్నారు. 

ABOUT THE AUTHOR

...view details