ఆంధ్రప్రదేశ్

andhra pradesh

purandeswari_visits_Jangareddy_Gudem_for_Meeting

ETV Bharat / videos

ఏలూరు జిల్లాలో పురందేశ్వరి పర్యటన - గ్రీన్ ఫీల్డ్ జాతీయ రహదారి నిర్మాణం పరిశీలన - Purandeswari latest update

By ETV Bharat Andhra Pradesh Team

Published : Dec 16, 2023, 3:36 PM IST

Purandeswari visits Jangareddy Gudem for Meeting: బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి (BJP State President Purandeswari) ఏలూరు జిల్లాలో ఈరోజు పర్యటించారు. ఏలూరు జిల్లాలో కార్యవర్గ సమావేశం కోసం జంగారెడ్డి గూడెం పురందేశ్వరి చేరుకున్నారు. ఈ క్రమంలో గ్రీన్ ఫీల్డ్ జాతీయ రహదారి నిర్మాణాన్ని(Green Field National Highway Construction) కంప్యూటర్ ప్రెజెంటేషన్ ద్వారా పరిశీలించారు. గ్రీన్ ఫీల్డ్ జాతీయ రహదారి పనుల పురోగతి గురించి అధికారులతో చర్చించారు. ప్రాజెక్టు నిర్మాణ పనులు రోజుకు ఎన్ని కిలోమీటర్లు జరుగుతున్నాయని అధికారులను అడిగి తెలుసుకున్నారు. 

Purandeswari visited Maddi Anjaneya Swamy Temple: అనంతరం పురందేశ్వరి ఏలూరు జిల్లా జంగారెడ్డి గూడెంలో ఉన్న ప్రముఖ పుణ్య క్షేత్రం మద్ది ఆంజనేయ స్వామి ఆలయాన్ని (Famous Anjaneya Swamy Temple) చేరుకుని, స్వామి వారిని దర్శించుకున్నారు. ఆలయానికి వచ్చిన పురందేశ్వరికి అర్చకులు, అధికారులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. ఆంజనేయ స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించిన తర్వాత పురందేశ్వరికి అర్చకులు ఆశీర్వచనాలు ఇచ్చి, తీర్థ ప్రసాదాలు అందించారు.

ABOUT THE AUTHOR

...view details