Purandeswari on Parliament Special Session: జమిలి ఎన్నికలు వస్తే ఎవరైనా ఎదుర్కోవాల్సిందే : పురందేశ్వరి - పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు
By ETV Bharat Andhra Pradesh Team
Published : Sep 1, 2023, 5:59 PM IST
Purandeswari on Parliament Special Session: జమిలి ఎన్నికలు వస్తే ఎవరైనా ఎదుర్కోవాల్సిందేనని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి అన్నారు. జమిలి ఎలక్షన్స్ కోసమే పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు అనే ప్రచారం జరుగుతోందని అన్నారు. అమృతోత్సవాల్లో భాగంగా దేశం నలుమూలల నుంచి మట్టి సేకరిస్తున్నట్లు తెలిపారు. గుంటూరు జిల్లా తెనాలి మండలం కొలకలూరులో ఆమె పర్యటించారు. నా భూమి-నా దేశం కార్యక్రమంలో పాల్గొని బీజేపీ శ్రేణులతో కలిసి ఇంటింటికి తిరుగుతూ మట్టిని సేకరించారు. సేకరించిన మట్టితో దిల్లీలో అమృతవనం ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. అందులో భాగంగా తెనాలి మండలం కొలకలూరు గ్రామంలో ఇంటింటికీ వెళ్లి మట్టిని సేకరిస్తున్నట్లు చెప్పారు. సెప్టెంబర్ ఒకటో తేదీ నుంచి 30వ తేదీ వరకు మొదటి దశ మట్టి సేకరణ కార్యక్రమం జరుగుతుందని తెలిపారు. రాజకీయాలకు తావు లేకుండా దేశంలోని ప్రతి ఇంటి వద్ద నుంచి మట్టిని సేకరిస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో యావత్ ప్రజానీకం పాల్గొని జయప్రదం చేయాలన్నారు.