ఆంధ్రప్రదేశ్

andhra pradesh

Purandeswari_Fires_on_Jagan

ETV Bharat / videos

మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా ప్రజలను జగన్ మోసం చేస్తున్నారు - పురందేశ్వరి - అనంతపురంలో పురందేశ్వరి

By ETV Bharat Andhra Pradesh Team

Published : Nov 7, 2023, 1:41 PM IST

Purandeswari Fires on Jagan: ఉమ్మడి అనంతపురం జిల్లాలో కరవు విలయతాండవం చేస్తున్నా రాష్ట్ర ముఖ్యమంత్రి  జగన్ మోహన్ రెడ్డికి కనిపించడం లేదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి మండిపడ్డారు. అనంతపురంలో ఆమె మాట్లాడుతూ జగన్ కేవలం ఎన్నికల్లో ఓట్ల కోసమే తన వైఖరిని మార్చి ప్రజలను మభ్య పెడుతున్నారని విమర్శించారు. హంద్రీనీవా సుజల స్రవంతి ద్వారా 3 లక్షల 45 వేల ఎకరాలకు సాగు, తాగునీరు అందిస్తామని ఎన్నికల్లో చెప్పిన మాట ఏమైందని ప్రశ్నించారు. 

Jagan Cheats People for Votes: ఇవాళ కుప్పం, పుంగనూరుకు నీటిని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తీసుకెళ్లే ప్రయత్నం పురందేశ్వరి పేర్కొన్నారు. ముఖ్యమంత్రి జగన్ రైతుల కోసం శీతల గిడ్డంగి ఏర్పాటు చేస్తానని మేనిఫెస్టోలో  చెప్పారన్నారు. ఎక్కడ ఒక్క గిడ్డంగి ఏర్పాటు చేసిన పాపాన పోలేదని ధ్వజమెత్తారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా బటన్లు నొక్కుతూ ప్రజల్ని, రైతులని మోసం చేస్తున్నారని అన్నారు. హామీల విషయంలో జగన్మోహన్ రెడ్డి ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. 

ABOUT THE AUTHOR

...view details