ఆంధ్రప్రదేశ్

andhra pradesh

purandeswari_fire_on_cm_jagn

ETV Bharat / videos

రాష్ట్రంలో విధ్వంసకర, అరాచక పాలన సాగుతోంది: పురందేశ్వరి - Purandeswari comments

By ETV Bharat Andhra Pradesh Team

Published : Dec 28, 2023, 4:08 PM IST

Updated : Dec 28, 2023, 6:55 PM IST

Purandeswari Fire on CM Jagan Administration: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత నాలుగున్నరేళ్లుగా విధ్వంసకర, అరాచక పాలన సాగుతోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి ధ్వజమెత్తారు. కేంద్ర ప్రభుత్వం అందిస్తోన్న పథకాలకు సీఎం జగన్ మోహన్ రెడ్డి తన స్టిక్కర్లు వేసుకుని ప్రచారం చేసుకుంటున్నారని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. కోటిపల్లి - నరసాపురం రైల్వేలైన్‌కు కేంద్రం రూ.1100 కోట్ల నిధులు ఇస్తే, రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాల్సిన రూ.385 కోట్ల నిధులు చెల్లించకపోవడంతో పనులు నెమ్మదించాయని పురందేశ్వరి పేర్కొన్నారు.

Purandeswari Visit Updates: రాష్ట్ర పర్యటనలో భాగంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి గురువారం డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో పర్యటించారు. పర్యటనలో భాగంగా ఆమె కోటిపల్లి - నరసాపురం రైల్వేలైన్ పనులను పరిశీలించారు. అనంతరం అమలాపురం పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ సీఎం జగన్‌పై ఘాటు వ్యాఖ్యలు చేశారు.''ఇవాళ రాష్ట్రంలో పరిస్థితులు ఎలా ఉన్నాయంటే వెంకటేశ్వర స్వామివారిని కూడా వదలటం లేదు. తితిదే ఛైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి అన్యమతస్తుడు. ఆయన నియమాకంపై గళమెత్తిన మొట్టమొదటి పార్టీ బీజేపీనే. తితిదేలో భక్తులు స్వామివారికి సమర్పించే ఆ సమర్పణలో కూడా ఒక శాతం తీసి, అభివృద్ధి పనుల కోసం వాడుకుంటామని ఈ రాష్ట్ర ప్రభుత్వం చెప్పింది. ఆ విషయంపై బీజేపీ సీరియస్‌గా గళమెత్తడంతో ఈ ప్రభుత్వం ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంది. కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న నిధులతో పరిపాలన సాగిస్తోన్న ఈ జగన్ రెడ్డి అతని బొమ్మను వేసుకుని ప్రచారం చేసుకుంటున్నారు. ఇది స్టిక్కర్ ప్రభుత్వం. జనసేన, బీజేపీలు పొత్తులోనే ఉన్నాయి. తెలుగుదేశంతో కలిసి వచ్చే విషయం కేంద్ర అధినాయకత్వం నిర్ణయిస్తుంది. కోటిపల్లి - నరసాపురం రైల్వేలైన్‌కు కేంద్ర ప్రభుత్వం రూ.1100 కోట్లు నిధులు ఇచ్చింది. అయితే, ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాల్సిన రూ.385 కోట్ల నిధులు చెల్లించకపోవడం కారణంగా ఇక్కడ పనులు నెమ్మదించాయి'' అని ఆమె గుర్తు చేశారు.

Last Updated : Dec 28, 2023, 6:55 PM IST

ABOUT THE AUTHOR

...view details