Purandeswari On AP Debts: 'రాష్ట్ర ప్రభుత్వ అనధికారిక అప్పు రూ.10.77 లక్షల కోట్లు'
Purandeswari Comments On AP Debts: రాష్ట్ర ప్రభుత్వం రిజర్వు బ్యాంకుకు చూపించిన రూ. 15 లక్షల కోట్ల ఆదాయం ఎలా వచ్చిందో ప్రజలకు వివరణ ఇవ్వాలని.. బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి డిమాండ్ చేశారు. రాష్ట్ర అప్పుల గురించి రఘురామకృష్ణరాజు పార్లమెంటులో అడిగిన ప్రశ్నకు నిర్మలా సీతారామన్.. రిజర్వు బ్యాంకు పరిధిలో రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న రుణాల గురించి మాత్రమే సమాధానం చెప్పారన్నారు. కానీ రాష్ట్ర ప్రభుత్వం.. కార్పొరేషన్ల తాకట్టు పెట్టి రూ. 98 వేల కోట్లు, ప్రభుత్వ ఆస్తుల తనఖా పెట్టి రూ. 98 వేల కోట్లు, సోషల్ సెక్యూరిటీ బాండ్ల ద్వారా రూ. 8 వేల 900 కోట్లు, ఏపీ ఫైనాన్సియల్ సర్వీసుల ద్వారా తీసుకున్న రూ.10 వేల కోట్ల రుణం.. ఇలా అనధికారికంగా తీసుకున్న రుణాలన్నీ కలిపితే మొత్తం 10 లక్షల 77 వేల కోట్ల అప్పులున్నాయని తెలిపారు. ఈ నాలుగేళ్ల కాలంలో ఎలాంటి కొత్త పరిశ్రమలు, పెట్టుబడులు రాకుండా ఎలా రాష్ట్ర ఆదాయం పెరిగిందనేది ప్రశ్నార్ధకమని చెప్పారు. రూ. 15 లక్షల కోట్ల ఆదాయం ఎలా వచ్చిందనే విషయంపై ప్రజలకు వైసీపీ ప్రభుత్వం వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు.