ఆంధ్రప్రదేశ్

andhra pradesh

వర్షాలతో అతలాకుతలం అవుతోన్న అల్లూరి జిల్లా

ETV Bharat / videos

Public facing problems with Floods: అల్లూరి జిల్లాలో పొంగి పొర్లుతున్న వాగులు.. రాకపోకలకు తీవ్ర అంతరాయం - Alluri Sitarama Raju District Latest News

By

Published : Aug 1, 2023, 4:58 PM IST

Public facing problems with Floods in Alluri District : అల్లూరి సీతారామరాజు జిల్లాలో కురుస్తున్న వర్షాలకు  వాగులు పొంగి పొర్లుతున్నాయి. చాలాచోట్ల గిరిజన ప్రాంతంలో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. కొండ వాగులు పొంగుతున్నాయి. అత్యధికంగా జి మాడుగుల మండలంలో వర్షాలు కురుస్తూనే ఉన్నాయి. బోయితలి - ఇంజరి వెళ్లే మార్గంలో కల్వర్టు కొట్టుకుపోయింది. ఒడిశా నుంచి వైపు రాకపోకలు నిలిచిపోయాయి. కల్వర్టు కొట్టుకుపోవడంతో ద్విచక్రవాహనదారులు అతికష్టం మీద వాగు దాటుతున్నారు. నీటి ప్రవాహం తక్కువగా ఉన్నప్పుడు అతి కష్టం మీద బండి వాగులోకి దించి సాహసంగా యువకులు తరలిస్తున్నారు. కొన్నిసార్లు  జారిపోయి గాయాల పాలవుతున్నారు. వెంటనే పూర్తిస్థాయి కల్వర్ట్ నిర్మించి రాకపోకలు పునరుద్దించాలని గిరిజనులు కోరుతున్నారు.  

రంపచోడవరం ఏజెన్సీ ప్రాంతంలో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో వాగులు పొంగి ప్రవహిస్తున్నాయి.. గిరిజనులు ఇబ్బందులు పడుతున్నారు. రంపచోడవరం మండలం సీతపల్లి వాగు, మారేడుమిల్లి మండలం బొడ్లంక వాగులు ఉద్ధృతంగా  ప్రవహిస్తున్నాయి. బొడ్లంక వాగు గుర్తెడు వెళ్లే ప్రధాన రహదారిలో ఉండడంతో ఆయా ప్రాంతాల్లో పనిచేసే ఉద్యోగులు, ఉపాధ్యాయులు తమ వాహనాలను స్థానికులతో ఒడ్డు దాటిస్తున్నారు.  మహిళలు, చిరుద్యోగులు, వాహనదారులు వాగులు దాటేందుకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

ABOUT THE AUTHOR

...view details