ఆంధ్రప్రదేశ్

andhra pradesh

పీఎస్‌ఎల్‌వీ-సీ 56 ప్రయోగానికి సర్వం సిద్ధం..

ETV Bharat / videos

PSLV C56 launch మరో విశిష్ట ప్రయోగానికి సిద్ధమైన ఇస్రో.. పీఎస్‌ఎల్‌వీ-సీ 56కి సర్వం సిద్ధం..

By

Published : Jul 29, 2023, 1:33 PM IST

Updated : Jul 29, 2023, 2:08 PM IST

PSLV-C56 ready for launch: భారత అంతరిక్ష పరిశోధన కేంద్రం- సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి ఈ నెల 30న పీఎస్​ఎల్వీ- సీ 56 ప్రయోగానికి.. సర్వం సిద్ధమైంది. వాణిజ్యపరమైన ప్రయోగాన్ని విజయవంతం చేసేందుకు శాస్త్రవేత్తలు పనుల్లో నిమగ్నమయ్యారు. ఈ రాకెట్ ద్వారా సింగపూర్​కు చెందిన 7 ఉపగ్రహాలను నింగిలోకి పంపనున్నారు. ఇందులో డీఎస్​- సార్ శాటిలైట్ ముఖ్యమైనది. వెలాక్స్ ఎంఎం, ఆర్కేడ్, స్కూబ్- 2, నులియన్, గెలాసియా- 2, ఓఆర్బీ- 12 ఉపగ్రహాలను ప్రయోగించనున్నారు. ఇది పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్ సిరీస్​లో 58వ ప్రయోగం. ఈ నెల 30న ఉదయం ఆరున్నరకు గంటలకు షార్​లోని మొదటి ప్రయోగ వేదిక నుంచి లాంచ్ రిహార్సల్స్ పూర్తి చేసి ప్రయోగం జరపనున్నారు. ఇప్పటికే షార్‌కు ఇస్రోలోని వివిధ కేంద్రాలకు చెందిన సంచాలకులు, సీనియర్‌ శాస్త్రవేత్తలు చేరుకున్నారు. ఈ ప్రయోగం పూర్తిగా వాణిజ్యపరమైంది. సింగపూర్‌కు చెందిన ఏడు ఉపగ్రహాలను నింగిలో ప్రవేశపెట్టనున్నారు. ఇస్రోలో అంతర్భాగమైన న్యూస్పేస్‌ ఇండియా లిమిటెడ్‌ ఛైర్మన్‌ తదితరులు షార్‌కు విచ్చేయనున్నారు. 

Last Updated : Jul 29, 2023, 2:08 PM IST

ABOUT THE AUTHOR

...view details