ఆంధ్రప్రదేశ్

andhra pradesh

PSLV ప్రయోగం విజయవంతం

ETV Bharat / videos

PSLV C-56 successfull: ఒకే రోజు ఏడు ఉపగ్రహాలు.. పీఎస్ఎల్వీ సీ-56 సక్సెస్

By

Published : Jul 30, 2023, 1:26 PM IST

PSLV C-56 successfull: చంద్రయాన్ 3 ఆగస్టు చివరి వారంలో చంద్రుడిపై అడుగుపెట్టనున్న తరుణంలో... ప్రపంచ దేశాలు ఆసక్తిగా ఎదురు చూస్తున్న వేళ.. ఇస్రో ఇవాళ సింగపూర్ దేశానికి చెందిన ఏడు ఉపగ్రహాలను కక్ష్యలోకి ప్రవేశపెట్టింది. భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ శ్రీ హరికోటలోని సతీష్ ధవన్ స్పేస్ సెంటర్ నుంచి పీఎస్ఎల్వీ సీ-56 ప్రయోగం విజయవంతమైంది. రోజు ఉదయం 6.31 గంటలకు పీఎస్ఎల్వీ సీ56 ప్రయోగం విజయవంతంగా నిర్వహించారు. 24 నిమిషాల వ్యవధిలో సింగపూర్ దేశానికి చెందిన ఏడు ఉపగ్రహాలను కక్ష్య లోకి ప్రవేశ పెట్టారు. ప్రయోగం విజయవంతం కావడంతో శాస్త్రవేత్తలు సంతోషం వ్యక్తం చేశారు. ఇస్రో శాస్త్రవేత్తలకు ఛైర్మన్‌ సోమనాథ్‌ అభినందనలు తెలిపారు. పీఎస్‌ఎల్‌వీ-సీ56 ద్వారా ఉపగ్రహాలను నిర్దేశిత కక్ష్యలోకి ప్రవేశపెట్టినట్లు వెల్లడించారు. ఇస్రోపై నమ్మకం ఉంచిన సింగపూర్‌ ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు. పీఎస్‌ఎల్‌వీ శ్రేణిలో మరిన్ని ప్రయోగాలు చేపడుతున్నామన్న ఛైర్మన్‌ … ఆగస్టు లేదా సెప్టెంబర్‌లో మరో ప్రయోగం జరుగుతుందన్నారు. వాణిజ్య పరమైన ప్రయోగం కావడంతో భారత్ కు ప్రయోజనం కలగనుంది.

ABOUT THE AUTHOR

...view details