Protests in Switzerland Over Chandrababu Arrest: 'బాబు కోసం మేము సైతం'.. స్విట్జర్లాండ్‌లో ప్రవాసులు కొవ్వొత్తులతో నిరసన - చంద్రబాబు అరెస్టుపై స్విట్జర్లాండ్‌లో నిరసనలు
By ETV Bharat Andhra Pradesh Team
Published : Sep 24, 2023, 6:55 PM IST
|Updated : Sep 24, 2023, 7:55 PM IST
Protests in Switzerland Over Chandrababu Arrest:స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో చంద్రబాబు అరెస్టును నిరసిస్తూ రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో తెలుగుదేశం శ్రేణులు ఆందోళనలు కొనసాగిస్తున్నారు. వైసీపీ ప్రభుత్వానికి, సీఎం జగన్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. చంద్రబాబును త్వరగా విడుదల చేయాలని డిమాండ్ చేశారు. చంద్రబాబు అరెస్టుకు నిరనసగా విదేశాల్లో ఆందోళలు కొనసాగతున్నాయి. బాబు కోసం మేము సైతం అంటూ ప్రవాసులు నిరసన తెలుపుతున్నారు. వైసీపీ ప్రభుత్వ తీరుకు నిరసనగా స్విట్జర్లాండ్‌లో ప్రవాసులు నినాదాలు చేశారు. రాజకీయ కక్ష సాధింపులో భాగంగానే విజనరీ నేతను జైల్లో పెట్టారని మండిపడ్డారు. చంద్రబాబు ఆయురారోగ్యాలతో ఉండాలని కొవ్వొత్తులతో ప్రదర్శన చేపట్టారు. బాబును తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. అలానే రాష్ట్రంలో కూడా 12వ రోజు కూడా నిరసనలు కొనసాగుతున్నాయి. చంద్రాబాబు కడిగిన ముత్యంలా బయటకు రావాలని టీడీపీ నాయకులు, కార్యకర్తలు నిరాహార దీక్షలు, హోమాలు, యాగాలు, పూజలు చేస్తున్నారు. మరి కొన్ని చోట్ల మోకాళ్ల మీద ఆయల మెట్లు ఎక్కి చంద్రబాబు బయటకు రావాలని భగవంతుడిని వేడుకుంటున్నారు.