Protests in Rajannadora's own party ఉపముఖ్యమంత్రి రాజన్నదొరకు సొంతపార్టీలో అసమ్మతి సెగ - Rajanna Dora in Gadapa Gadapa Ku Mana Prabutvam
Protests in Rajannadora's own party From own mpp amd mptc: సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో అధికార పార్టీలో ఒక్కొక్కటిగా అసమ్మతి స్వరాలు వినిపిస్తున్నాయి. తాజాగా పార్వతీపురం జిల్లా వైఎస్సార్సీపీలో అసమ్మతి సెగలు బహిర్గతం అయ్యాయి. ఉపముఖ్యమంత్రి రాజన్నదొరకు వ్యతిరేకంగా సొంత పార్టీ నుంచి అసంతృప్తి వ్యక్తమైంది. పాచిపెంటలో రాజన్నదొర పాల్గొన్న గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ఎంపీపీ ప్రమీల వర్గం నేతలు బహిష్కరించారు. జడ్పీ ఛైర్మన్‌ను ఆహ్వానించడం వరకే పరిమితమై తర్వాత అక్కడి నుంచి వచ్చేశారు. ఆమెతో పాటు కార్యక్రమానికి 9 మంది ఎంపీటీసీలు, సర్పంచులు దూరమయ్యారు. స్థానిక నాయకత్వానికి రాజన్నదొర ప్రాధాన్యత ఇవ్వనందునే బహిష్కరించామని అసంతృప్తి నేతలు తెలిపారు. అధికార పార్టీని నమ్ముకొని ఉన్న ఉన్న ఎంపీపీ మరియు ఎంపీటీసీలకు కూడా తెలియకుండా గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని జరపడం సమంజసం కాదని వారందరూ ముక్తకంఠంతో ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో టీడీపీలో ఉన్నామని, తామందరం కలిసి వైసీపీ గెలుపు కోసం కలిసికట్టుగా పని చేయడం వల్లనే అధికారం వచ్చిందని గుర్తు చేశారు. ప్రస్తుతం తమని కలుపుకోకుండా ఎవర్నో నమ్ముకొని ఇలాంటి కార్యక్రమాలు చేయడం మంచి పద్దతి కాదని అసహనం వ్యక్తం చేశారు.