Protests Continue in Germany over CBN Illegal Arrest: చంద్రబాబు అక్రమ అరెస్ట్‌పై జర్మనీలో కొనసాగుతున్న నిరసనలు - tdp news
By ETV Bharat Andhra Pradesh Team
Published : Oct 23, 2023, 12:28 PM IST
Protests Continue in Germany over CBN Illegal Arrest:తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడి అక్రమ అరెస్ట్‌ను నిరసిస్తూ.. గత ఏడు వారాలుగా జర్మనీలో నిరసనలు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా మ్యూనిచ్ నగరంలోని ప్రతిష్టాత్మక కార్ల్స్ సెంటర్‌లో నిర్వహించిన నిరసనకు ఎన్ఆర్ఐలు చంద్రబాబుకు మద్దతు తెలిపారు.
NRI Ravi Kiran Comments:ఎన్‌ఆర్‌ఐ రవికిరణ్ సామాజిక మాధ్యమాల వేదికగా మాట్లాడుతూ..''చంద్రబాబు అక్రమ అరెస్ట్‌కు వ్యతిరేకంగా జర్మనీలో వరుసగా ఏడో వారం నిరసనలు కొనసాగుతున్నాయి. మ్యూనిచ్ నగరంలోని ప్రతిష్టాత్మక కార్ల్స్ సెంటర్‌లో నిర్వహించిన నిరసనలకు ఎన్ఆర్ఐలు మద్దతు పలికారు. ఎన్ఆర్ఐలు చేస్తున్న నిరసన ప్రదర్శనను ఇక్కడి స్థానికులు ఆసక్తిగా తిలకిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో నెలకొన్న అప్రజాస్వామిక పరిస్థితులను ఎన్ఆర్ఐలు వారికి వివరిస్తున్నారు. టీడీపీ హయాంలో ఏర్పాటైన స్కిల్ డెవలప్‌మెంట్ సంస్థలో ట్రైనింగ్ పొంది, ఉద్యోగం సంపాదించినందుకు నాకు చాలా గర్వంగా ఉంది. నేనే కాదు ఇంకా చాలా మంది యువతి, యువకులు ఈ సంస్థ ద్వారా ఉద్యోగాలు పొందారు. మా ఉద్యోగాలకు పునాది వేసిన చంద్రబాబును అక్రమంగా అరెస్ట్ చేయడం అన్యాయం'' అని ఆయన అన్నారు.