ఆంధ్రప్రదేశ్

andhra pradesh

Protests against MLA

ETV Bharat / videos

Protests against MLA మాకు ఈ ఎమ్మెల్యే వద్దంటూ.. భారీ ర్యాలీ తీసిన వైసీపీ కార్యకర్తలు - Srikakulam

By

Published : May 21, 2023, 8:32 PM IST

Protests against Etcherla MLA: శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల నియోజకవర్గం ఎమ్మెల్యే గొర్లె కిరణ్ కుమార్​కు వ్యతిరేకంగా వైసీపి ద్వితీయ శ్రేణి నేతలు శ్రీకాకుళం నగరం పిఎన్ కాలనీ సమీపంలోని ఓ ఫంక్షన్ హాల్​లో సమావేశం ఏర్పాటు చేసి నిరసన తెలిపారు. దిగువ స్థాయి నాయకులు కార్యకర్తలు ఎచ్చెర్ల మండల కేంద్రం నుంచి జగన్ ముద్దు- కిరణ్ వద్దు అంటూ నినాదాలు చేస్తూ భారీ ఎత్తున ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎచ్చెర్ల, జి సిగడాం మండలాకు చెందిన నేతలు పాల్గొన్నారు. ఎమ్మెల్యే కిరణ్ కుమార్ గెలుపుకు కష్టపడిన పని చేసిన వారికి విలువ ఇవ్వకుండా కొంతమంది నేతలకే వత్తాసు పలుకుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వైసీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రూ లక్షల్లో పెట్టుబడి పెట్టి పనులు చేసినప్పటికీ ఇంత వరకు బిల్లు రాలేదని వాపోయారు. ఎమ్మెల్యే కుటుంబీకులకే పదవులు పనులు అధికారులు కల్పిస్తున్నారని మండిపడ్డారు. వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యే కిరణ్ కుమార్​కు టికెట్ ఇస్తే పనిచేసే ప్రసక్తే లేదని ముక్తకంఠంతో తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details