ఆంధ్రప్రదేశ్

andhra pradesh

Gadapagadapaku program

ETV Bharat / videos

Protest against MLA Eliza: ఎమ్మెల్యే ఎలీజాకు నిరసన సెగ.. అభివృద్ధిపై నిలదీసిన యువకుడు - AP Latest News

By

Published : May 15, 2023, 8:42 PM IST

Protest against MLA Eliza: రాష్ట్రంలో వైసీపీ పాలనలో విసుగుచెందిన ప్రజలు నాయకులపై తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఆ విధంగానే గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొంటున్న వైసీపీ నాయకులకు పూర్తి స్థాయిలో ప్రజల నుంచి నిరసన సెగ తగులుతోంది. తాజాగా ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం మండలం శ్రీనివాసపురం గ్రామంలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా పాల్గొన్న వైసీపీ ఎమ్మెల్యే ఎలీజాకు నిరసన సెగ తగలింది. కార్యక్రమంలో భాగంగా ఇంటింటికి తిరుగుతూ సంక్షేమ పథకాల అమలు గురించి ప్రజల్ని అడిగి తెలుసుకున్నారు. 

ఈ క్రమంలో గ్రామానికి చెందిన మోహన్ అనే యువకుడు గ్రామంలో అభివృద్ధి ఏం జరిగిందంటూ ఎమ్మెల్యేను నిలదీశాడు. దీంతో సచివాలయంలో చూసుకోవాలని బదులిచ్చిన ఎమ్మెల్యే.. అక్కడి నుంచి వెళ్లిపోయారు. అభివృద్ధి గురించి అడుగుతుంటే సచివాలయం వద్దకు వెళ్లమనడం ఏంటని ఎదురు ప్రశ్నించారు. ఈ క్రమంలో పోలీసులు, వైసీపీ కార్యకర్తలు జోక్యం చేసుకుని అతడ్ని అడ్డుకున్నారు. ఇదిలా ఉంటే గ్రామంలో అభివృద్ధి పనులు జరగడం లేదంటూ గ్రామస్థులు బహిరంగంగానే ఆరోపిస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details