ఆంధ్రప్రదేశ్

andhra pradesh

Protest_Against_Chandrababu_Arrest

ETV Bharat / videos

Protest Against Chandrababu Arrest : చంద్రబాబు అరెస్టుకు నిరసనగా రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు.. సత్తెనపల్లిలో వినూత్నంగా.. - చంద్రబాబు అరెస్టుకు నిరసనగా రాష్ట్రంలో ఆందోళనలు

By ETV Bharat Andhra Pradesh Team

Published : Oct 11, 2023, 6:26 PM IST

Protest Against Chandrababu Arrest :తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు అక్రమ అరెస్టుకు నిరసనగా రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు కొనసాగుతున్నాయి. పల్నాడు జిల్లా సత్తెనపల్లిలో తెలుగు యువత నాయకులు మెడకు ఉరి తాళ్లు వేసుకొని నిరసన తెలిపారు. కర్నూలులో పెద్ద ఎత్తున ఆందోళన కొనసాగుతున్నాయి. చంద్రబాబు అరెస్టును ఖండిస్తూ అంబేడ్కర్ విగ్రహానికి టీడీపీ నాయకులు వినతిపత్రం అందించారు. చంద్రబాబుకు తోడుగా నేను సైతం అంటూ గోనెగండ్లలో రక్తంతో రాశారు. 

శ్రీసత్య సాయి జిల్లా ధర్మవరంలో గాంధీ విగ్రహం వద్ద కళ్లకు నల్ల గంతలు కట్టుకొని నేతలు నిరసన తెలిపారు. సైకో పోవాలి -సైకిల్ రావాలి అంటూ నినాదాలు చేశారు. అనంతపురం జిల్లా ఉరవకొండలో టీడీపీ నాయకులు, కార్యాకర్తలు అర్ధనగ్నంగా ర్యాలీ నిర్వహించారు. చంద్రబాబును వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. స్కిల్​ డెవలప్​మెంట్​ కేసులో చంద్రబాబు అరెస్ట్ అయిన దగ్గర నుంచి రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు కొనసాగుతూనే ఉన్నాయి. రోజూ రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో టీడీపీ నాయకులు దీక్షలు, దేవాలయాల్లో పూజ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details