Protest against chair person Indraja: హిందూపురం మున్సిపల్ చైర్పర్సన్ ఇంద్రజకు నిరసన సెగ - Municipal chair person Indrajaku protest seg
Protest Against Chair Person Indraja: శ్రీసత్యసాయి జిల్లా హిందూపురం మున్సిపల్ ఛైర్పర్సన్ ఇంద్రజకు నిరసన సెగ తగిలింది. మున్సిపల్ పరిధిలోని 14వ వార్డు పోచనాపల్లిలో ఆకస్మిక తనిఖీకి వెళ్లిన ఇంద్రజను.. వార్డు ప్రజలు సమస్యలతో నిలదీశారు. తాగునీరు, సరైన రోడ్లు లేక తామంతా ఇబ్బందులు పడుతుంటే... రెండు సంవత్సరాల తర్వాత ఇప్పుడు తనిఖీలకు వస్తారా అంటూ ప్రశ్నించారు. మీకు పనులు కావాలా.. గొడవ కావాలా అని ఛైర్పర్సన్ ప్రశ్నించగా... రెండేళ్లలో ఏం అభివృద్ధి పనులు చేశారో చూపించాలంటూ స్థానికులు నిలదీశారు.
రెండు సంవత్సరాలుగా ఏం అభివృద్ధి పనులు చేశారో చూపించాలంటూ అడ్డుకున్నారు. ఇందుకు స్పందించిన చైర్ పర్సన్ మీరు గొడవకు వచ్చారా.. పనులు కావాలా.. గొడవలు కావాలా.. అంటూ ప్రశ్నించగా రెండు సంవత్సరాలుగా చేసింది ఏమీ లేదు.. ఇప్పుడు చేసేది కూడా ఏమీ లేదు. మేము గొడవే చేస్తామంటూ జవాబు ఇచ్చారు. అధిక వర్షాలకు వార్డు సమీపంలో పెన్నా నదిపై బ్రిడ్జి కూలిపోతే బ్రిడ్జి నిర్మాణంకు డబ్బులు డిమాండ్ చేస్తారా అంటూ ఆరోపించారు. తమ వార్డుల వైసీపీ అభ్యర్థిని గెలిపిస్తే వైస్ చైర్మన్ వార్డులోనే సమస్యలు. సమస్యలు పరిష్కరించకపోతే ఇంకా ఏమి అభివృద్ధి చేస్తున్నారు అంటూ సమస్యలు ఏ కరువు పెట్టడంతో దిక్కుతోచని చైర్పర్సన్ అన్ని సమస్యలు పరిష్కరిస్తామంటూ ముందుకు వెళ్లిపోయారు.