'ఇప్పుడెందుకు వచ్చావ్?' - మంత్రి అంబటి రాంబాబుకు నిరసన సెగ - అంబటి రాంబాబు
By ETV Bharat Andhra Pradesh Team
Published : Jan 5, 2024, 5:49 PM IST
Protest Against Ambati Rambabu:పల్నాడు జిల్లా ముప్పాళ్లలో మంత్రి అంబటి రాంబాబుకు తీవ్రస్థాయిలో నిరసన సెగ తగిలింది. రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన మన్సూర్ అలీ మృతదేహానికి నివాళులు అర్పించేందుకు వెళ్లిన మంత్రిపై స్థానికులు విరుచుకుపడ్డారు. వివరాలివీ.. ముప్పాళ్లకు చెందిన మన్సూర్ అలీ రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. ప్రమాదానికి కారణమైన డ్రైవర్‌ను పట్టుకుని గ్రామస్థులు పోలీసులకు అప్పగించారు. అయితే స్టేషన్ బెయిల్‌పై డ్రైవర్‌ను వదిలేశారు. దీనిపై ఆగ్రహించిన గ్రామస్థులు 2 గంటల పాటు రోడ్డుపై బైఠాయించి ధర్నా చేశారు. నిందితుడిని పోలీసులు వదిలేయడంపై మండిపడ్డారు.
ఇంత జరిగినా పట్టించుకోని మంత్రి అంబటి ఆ తర్వాత మన్సూర్ మృతదేహానికి నివాళులు అర్పించేందుకు రావడంపై ఆగ్రహం వ్యక్తంచేశారు. మేం ఓట్లేస్తే గెలిచి, కష్టం వచ్చినప్పుడు పట్టించుకోరా అంటూ నిలదీశారు. ఈసారి ఓట్ల కోసం వస్తే చెప్పులతో కొడతామంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. దీనిపై ఏమీ మాట్లాడని మంత్రి అంబటి రాంబాబు మన్సూర్ మృతదేహానికి పూలమాల వేసి అక్కడి నుంచి వెళ్లిపోయారు.