ఆంధ్రప్రదేశ్

andhra pradesh

మోతమోగిస్తోన్న టమాటా

ETV Bharat / videos

Tomato record prices: టమాటా కిలో రూ.50కే!.. బారులు తీరిన ప్రజలు.. - కడపలో టమోటా కొనుగోలుకు బారులు తీరిన స్థానికులు

By

Published : Jul 5, 2023, 12:31 PM IST

Tomato record prices: రాష్ట్ర వ్యాప్తంగా మార్కెట్లలో కూరగాయల ధరలు మండిపోతున్నాయి. ఇటీవల కురిసిన వర్షాల కారణంగా పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. ఈ క్రమంలో గత వారం రోజుల నుంచి టమాటా ధరలు మోతమోగిస్తున్నాయి. వర్షాలకు తోడు వేడిగాలుల ప్రభావం వల్ల టమాటా పంట దిగిబడి తగ్గిపోయి ధరలు అమాంతం పెరిగిపోయాయి. ఈ రోజు మార్కెట్​లో కిలో టమాటా ధర రూ.140 పలుకుతోంది. ఆకాశాన్నంటుతున్న ధరలతో టమాటాలను కొనాలంటేనే ప్రజలు జంకుతున్నారు. అయితే కడప రైతు బజార్​లో మాత్రం ప్రభుత్వం సబ్సిడీతో కిలో టమాటాలను 50 రూపాయలకు అందిస్తోంది. దీంతో తెల్లవారుజాము నుంచే ప్రజలు టమాటాల కోసం బారులు తీరారు. జిల్లాకు రెండు టన్నుల టమాటాలు ఇవ్వటంతో ఆయా ప్రాంతాల రైతు బజార్లలో సబ్సిడీతో విక్రయిస్తున్నారు. ఆధార్​ కార్డులు ఉన్నవారికి మాత్రమే సబ్సిడీపై టమాటాలను అందిస్తున్నారు. దీంతో ఇంట్లో పనులన్నింటినీ పక్కనపెట్టి ఆధార్​ కార్డు పట్టుకుని మహిళలు, పిల్లలు, వృద్ధులు టమాటాల కోసం గంటల తరబడి లైన్లో నిల్చున్నారు. 

ABOUT THE AUTHOR

...view details