ఆంధ్రప్రదేశ్

andhra pradesh

dig_media_conference

ETV Bharat / videos

Prisons DIG with Media on Chandrababu Health Condition: చంద్రబాబు ఆరోగ్యంపై జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదు: జైళ్ల శాఖ డీఐజీ - Chandrababu Health Updates

By ETV Bharat Andhra Pradesh Team

Published : Oct 13, 2023, 7:56 PM IST

DIG Media Conference on Chandrababu Health Condition:చంద్రబాబు ఆరోగ్యంపై జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదని జైళ్ల శాఖ డీఐజీ తెలిపారు. చంద్రబాబు ఆరోగ్య పరిస్థితిపై రాజమహేంద్రవరం జైలు అధికారులు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ క్రమంలో జైళ్ల శాఖ డీఐజీ మాట్లాడుతూ జైలులో చంద్రబాబుకు కావల్సిన అన్ని వైద్య సదుపాయాలు కల్పించినట్లు చెప్పారు. ఆరోగ్యపరంగానూ చంద్రబాబుకు ఇబ్బంది లేదన్నారు. రోజుకు మూడు సార్లు చంద్రబాబు హెల్త్​ చెకప్​ చేయడం జరుగుతుందన్నారు. ఆయన ఆరోగ్యానికి సంబంధించి మేము అన్ని రకాల జగ్రత్తలు తీసుకుంటున్నాము.. ప్రస్తుతానికి ఆయనకు ఎలాంటి ఇబ్బంది లేదని డీఐజీ తెలిపారు. 

సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తున్నారు. వాటిని నమ్మవలసిన అవసరం లేదు. వాటిలో ఎలాంటి వాస్తవం లేదని అన్నారు. చంద్రబాబు ఆరోగ్యం విషయంలో ఆందోళన చెందాల్సిన అవసరం లేదని డీఐజీ తెలిపారు.  ప్రత్యేక సిబ్బంది చేత ఎప్పటికప్పుడు వైద్య పరీక్షలు చేయిస్తున్నట్లు చెప్పారు. అలానే భద్రత విషయంలో చంద్రబాబుకు జైల్లో ఎలాంటి ముప్పు లేదని.. నిరంతరం సిబ్బంది పర్యవేక్షణలోనే ఉన్నారని అన్నారు.

ABOUT THE AUTHOR

...view details