ఆంధ్రప్రదేశ్

andhra pradesh

President Murmu to Unveil NTR Commemorative Coin of Rs 100

ETV Bharat / videos

President Murmu to Unveil NTR Commemorative Coin of Rs 100: ఎన్టీఆర్ బొమ్మతో వంద రూపాయల కాయిన్.. విడుదల చేయనున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము - rbi green signal to ntr toy on 100 rupee coin

By ETV Bharat Andhra Pradesh Team

Published : Aug 27, 2023, 10:31 PM IST

Updated : Aug 28, 2023, 6:29 AM IST

 President Murmu to Unveil NTR Commemorative Coin of Rs 100: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం  వ్యవస్థాపకుడు దివంగత నేత నందమూరి తారక రామారావు చిత్రంతో ఆర్బీఐ ప్రత్యేకంగా రూపొందించిన 100 రూపాయల నాణేన్ని రాష్ట్రపతి భవన్‌లో రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము సోమవారం  ఆవిష్కరించనున్నారు. ఈ కార్యక్రమంలో పాలొనేందుకు ఎన్టీఆర్‌ కుటుంబసభ్యులు, తెలుగుదేశం అధినేత చంద్రబాబు, ఎన్టీఆర్​తో అనుబంధం ఉన్న పలువురు సీనియర్‌ నాయకులు ఇప్పటికే దిల్లీ చేరుకున్నారు. ఈ కార్యక్రమం అనంతరం భారత ఎన్నికల సంఘం ప్రధాన కార్యాలయానికి వెళ్లనున్న చంద్రబాబు.. రాష్ట్రంలో ఓటరు జాబితా తయారీలో భారీగా బయటపడుతున్న అక్రమాలపై ఈసీకి ఫిర్యాదు చేయనున్నారు. తెలుగుదేశం పార్టీ  సానుభూతిపరుల ఓట్లను అడ్డగోలుగా తొలగింపుపై ఫిర్యాదు చేయనున్నారు. అలాగే  వైసీపీ అనుకూలంగా ఉన్న వారి ఓట్లను నిబంధనలకు విరుద్ధంగా చేరుస్తున్న ఉదంతాలను ఎన్నికల ప్రధాన కమిషనర్‌కు ఆధారాలతో సహా వివరించనున్నారు. ఇప్పటికే ఉరవకొండ, పర్చూరు, విజయవాడ సెంట్రల్, విశాఖ తదితర నియోజకవర్గాల్లో బయటపడ్డ అక్రమాలపై సాక్ష్యాలను సమర్పించనున్నారు. 

Last Updated : Aug 28, 2023, 6:29 AM IST

ABOUT THE AUTHOR

...view details