ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / videos

విశాఖ ఆర్‌కే బీచ్‌లో ఆకట్టుకున్న నౌకాదళ విన్యాసాలు - విశాఖపట్టణం తాజా వార్తలు

By

Published : Dec 4, 2022, 7:13 PM IST

Updated : Feb 3, 2023, 8:34 PM IST

Navy Day Celebrations: నేవీడే సందర్బంగా విశాఖ ఆర్‌కే బీచ్‌లో నౌకాదళం నిర్వహించిన విన్యాసాలు అబ్బురపరిచాయి. క్లిష్ట పరిస్థితుల్లో శత్రుమూకలపై దాడి చేసే విన్యాసాలు అందరినీ ఆకట్టుకున్నాయి. హైస్పీడ్ బోట్లతో సముద్రం నుంచి వేగంగా ఒడ్డుకు రావడం, యుద్ధనౌకలో విన్యాసాలు, గగనతలంలో చేతక్ హెలికాప్టర్ల సాహసకృత్యాలు, మిగ్-29 యుద్ధవిమానాల ప్రదర్శన సహా యుద్ధనౌకలు, జలాంతర్గాముల నుంచి ఒకేసారి రాకెట్ ఫైరింగ్ చేయడం మెప్పించింది. బోయింగ్ రేంజ్ పీఎస్​ఐ విమాన విన్యాసాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. నౌకాదళ లాంఛనాలతో సూర్యాస్తమయ వేడుకలు నిర్వహించారు. యుద్ధనౌకల నుంచి రంగురంగుల కాంతులతో బాంబులు విసరడం ఆక‌ట్టుకుంది. వివిధరకాల ప్రమాణాలతో నౌకాదళం సిబ్బంది జాతీయ పతాకాలను ప్రదర్శించారు. ఈ సందర్భంగా శంకర్ ఎహసాన్ లాయ్ బృందం ఆలపించిన నౌకాదళ గీతం వీనుల విందుగా సాగింది. ఈ వేడుకలకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము హాజరై.. విన్యాసాలను తిలకించారు. ఈ ఉత్సవాలకు రాష్ట్రపతితో పాటు నౌకాదళ దినోత్సవానికి గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్‌, కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి, శాసనసభాపతి తమ్మినేని, మంత్రులు గుడివాడ అమర్‌నాథ్‌, విడదల రజని హాజరయ్యారు.
Last Updated : Feb 3, 2023, 8:34 PM IST

ABOUT THE AUTHOR

...view details