హామీలు నెరవేర్చని జగన్ ప్రజలకు ఏం సమాధానం చెబుతారు ?
By ETV Bharat Andhra Pradesh Team
Published : Jan 2, 2024, 9:44 PM IST
YCP Government Play Key Role In Assurances:వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి రావటంలో కీలక పాత్ర పోషించాయి నవరత్న హామీలు. మద్య నిషేధం నుంచి ప్రతి విద్యార్థికి ఫీజు రీయింబర్స్‌మెంట్ వరకు నెత్తిన చేయి పెట్టి నాదీ హామీ అంటూ సీఎం జగన్ తీయని మాటలు చెప్పి నాలున్నరేళ్లు గడిచిపోయాయి. అసలు జగన్ చెప్పిన ఆ నవరత్నాలు ఏంటి? వాటిల్లో పేర్లు మార్చిన పథకాలు ఎన్ని? నవరత్నాల వెనుక ఉన్న నవమోసాల మాటేంటి? జలయజ్ఞమేది? మద్య నిషేధం ఏది? జగన్ మాటలు నమ్మి, ఆశపడి ఓట్లేసిన ప్రజల పరిస్థితేంటి? మాట తప్పను మడమ తిప్పను, విశ్వసనీయతకు చిరునామా, చిన్న పిల్లలకు మేనమామ అంటూ జగన్ తన అరచేతి వైకుంఠంలో చూపించింది నవరత్నాలనా? రంగురాళ్లనా? ఆ నినాదం వెనుక ఉన్న అసలు రంగేంటి? ముఖ్యమంత్రి చెప్పింది ఒకటి చేస్తుంది మరొకటి. మద్యపానం నిషేధం లేదు, మద్యం నియంత్రణ లేదు. మద్యం నిషేధం చేయకపోవడంతో పేద ప్రజలు నష్టపోతున్నారు. ఈ విషయంలో జగన్ ఏం చేశారు? ఇదే అంశంపై నేటి ప్రతిధ్వని.