Prathidwani: జగన్నాటకాన్ని చూసి జంకుతున్న ఆంధ్రప్రదేశ్ - నేటి ప్రతిధ్వని పై విమర్శలు
By ETV Bharat Andhra Pradesh Team
Published : Sep 13, 2023, 9:32 PM IST
Prathidwani: మనిషి ఒంట్లో రక్తం ప్రవహిస్తుంది. తన ఒంట్లో మాత్రం... పగ, ప్రతీకారాలు ప్రవహిస్తుంటాయి. తనకు నచ్చకపోతే కూలిపోవాల్సిందే. నేల రాలి పోవాల్సిందే. తనని ఎదిరించిన వారిని, తనను కాదన్న వారిని బెదిరించటమే అతనికి తెలిసిన విద్య. ఆ విపరీత మనస్తత్వం గురించి తెలిసే ఆయన చెల్లెళ్లు సునిత, షర్మిల కూడా తనకు దూరమయ్యారు. ఇంక ఆ వ్యక్తి ఎలాంటి వాడో తెలుసుకోవాల్సింది రాష్ట్ర ప్రజలే. జగన్మోహన్‌రెడ్డి వ్యవహారశైలి గురించి విపక్షాలు, విశ్లేషకులు చెప్పే మాట ఇది. నాలుగేళ్లుగా రాష్ట్రంలో ఆయన పాలననే అందుకు ఉదాహరణగా చూపుతారు. మరి ఈ ప్రభావం రాష్ట్రంపై ఎలా పడుతోంది? ఇక్కడ జరుగుతున్న పరిణామాలపై దేశవ్యాప్తంగా మిగిలిన రాష్ట్రాలు ఏం అనుకుంటున్నాయి? ఒక్క ఛాన్స్ అనేది ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఎంతటి ఉపద్రవం తీసుకుని వచ్చింది? ఓటేసి తప్పు చేశామనే పశ్చాతాపం ప్రజల్లో కనిపిస్తోందా? ఏపీలో ఇంత దారుణాలు జరుగుతుంటే ఇంకా కొందరు మేథావుల ముసుగులు వేసుకున్న వారు ఖండించటానికి ఎందుకు సంకోచిస్తున్నారు? ఇదే అంశంపై నేటి ప్రతిధ్వని.