ఆంధ్రప్రదేశ్

andhra pradesh

prathidwani_on_ttd

ETV Bharat / videos

Prathidwani: వివాదాస్పదంగా టీటీడీ పాలకమండలి సభ్యుల చరిత్ర.. టీటీడీని రాజకీయ పునరావాసంగా మారుస్తున్నారా? - తిరుమల తిరుపతి దేవస్థానం

By ETV Bharat Andhra Pradesh Team

Published : Aug 26, 2023, 10:38 PM IST

Updated : Aug 26, 2023, 10:55 PM IST

Prathidwani : తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) రాజకీయ పునరావాసంగా మార్చేసింది వైఎస్సార్సీపీ ప్రభుత్వం. పాలక మండలిలో నేర చరిత్ర (TTD Board Members 2023) కలిగిన వారిని కళంకితుల్ని నియమించి తిరుమల పవిత్రతని మసకభారు చేసింది సీఎం జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం. దిల్లీ మద్యం కుంభకోణంలో నిందితుడైన శరత్​ చంద్రారెడ్డి, మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా కుంభకోణంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిని బోర్డు సభ్యులుగా నియమించి టీటీడీ ప్రతిష్టను మంటకలిపేసింది. గత పాలక మండలిలో కూడా 14 మందిపై నేర ఆరోపణలు ఉన్నట్లు కోర్టుల్లో కూడా కేసులు దాఖలాలు అయ్యాయి. తిరుమలలో సామాన్య భక్తులకు చోటు లేకుండా వివాదాస్పద నిర్ణయాలు ఒకవైపు, కళంకితుల నియామకం మరోవైపు.. మొత్తంగా టీటీడీని వివాదాలమయంగా మార్చింది వైసీపీ ప్రభుత్వం... జైలు జీవితం గడిపి బెయిల్ మీద ఉన్న మద్యం వ్యాపారులకు కలియుగ వైకుంఠం పాలనా బాధ్యతలు అప్పగించటం ఏ కోణంలో అయినా సమర్థనీయమా? టీటీడీ ఛైర్మన్ నియామకంపైనా చాలామంది అభ్యంతరాలు వ్యక్తం చేశారు. తిరుమలకు సంబంధించి ఏ పనీ ఈ ప్రభుత్వం సజావుగా చేయదా? ముఖ్యమంత్రికి నిజంగా శ్రీవారిపై విశ్వాసం ఉందా? బ్రహ్మోత్సవాలు, తదితర సందర్భాలలో హిందూ సంప్రదాయాలను ఆయన పాటిస్తున్నారా? ఇదే నేటీ ప్రతిధ్వని..

Last Updated : Aug 26, 2023, 10:55 PM IST

ABOUT THE AUTHOR

...view details