ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / videos

PRATHIDWANI హోంశాఖ మార్గదర్శకాలు నిరంకుశత్వానికి పరాకాష్ఠ - నేటి ప్రతిధ్వని వివరాలు

By

Published : Jan 3, 2023, 11:13 PM IST

Updated : Feb 3, 2023, 8:38 PM IST

రాష్ట్రంలో రోడ్‌ షో సభలు, ర్యాలీలను నియంత్రించాలన్న ప్రభుత్వం నిర్ణయం పెనుదుమారమే రేపుతోంది. రాష్ట్ర హోంశాఖ జారీచేసిన మార్గదర్శకాలు నిరంకుశత్వానికి పరాకాష్ఠ అంటున్నాయి విపక్షాలు. మున్సిపల్‌, పంచాయతీ రహదారులు, రోడ్డు మార్జిన్ల వద్ద పోలీసు యాక్ట్‌ నిబంధనల అమలు.. ఆయా ప్రాంతాల్లో రోడ్డు షోలు నిర్వహించకుండా చూడాలని హోంశాఖ ఆదేశాల్ని చీకటి జీవోగా అభివర్ణిస్తున్నాయి ప్రధాన పార్టీలన్నీ. ఎంపిక చేసిన ప్రదేశాల్లోనే సభలు, ర్యాలీలు జరిగేలా చూడాలన్న పరిమితులతో పాటు, అత్యంత అరుదైన సందర్భాల్లో షరతులతో కూడిన అనుమతి అన్న వెసుబాట్ల అంతరార్థం ఏమిటనీ ప్రశ్నిస్తున్నారు. ఈ పేరుతో ప్రజాస్వామ్యానికి కొత్త సంకెళ్లు వేసే ప్రయత్నం చేస్తున్నారనే అభిప్రాయం అన్నిపార్టీల నుంచి వ్యక్తం అవుతోంది. ఇదే అంశంపై నేటి ప్రతిధ్వని.
Last Updated : Feb 3, 2023, 8:38 PM IST

ABOUT THE AUTHOR

...view details