PRATHIDWANI: పాలనాపరమైన ఉత్తర్వులను ప్రభుత్వం ఎందుకు దాచి పెడుతోంది? - prathidwani debate
రాష్ట్రంలో పరిపాలనా తీరుతెన్నులకు నిదర్శనంగా నిలిచే జీఓలను ప్రభుత్వం గోప్యంగా ఉంచుతోంది. రెండు, మూడు నెలలకోసారి నామమాత్రంగా కొన్ని ఉత్తర్వులను వెబ్‌సైట్లో ఉంచడం తప్పితే.. మెజారిటీ జీవోలు ప్రజలెవ్వరికీ అందుబాటులో లేవు. ఇదేమిటని ఎవరైనా అడిగితే... అవన్నీ కాన్ఫిడెన్షియల్ అంటూ ప్రభుత్వం దాటవేస్తోంది. ప్రజల రోజువారీ జీవితాలను ప్రభావితం చేసే పాలనాపరమైన ఉత్తర్వులను ప్రభుత్వం ఎందుకు దాచి పెడుతోంది? పాలనలో జరిగే మార్పులను తెలుసుకునే అవకాశం లేకపోతే.. రాజ్యాంగం పౌరులకు కల్పించిన హక్కులకు భంగం కలగదా? కోర్టులు హెచ్చరించినా ప్రభుత్వ ధోరణిలో మార్పు రాకపోతే.. ఇక రాష్ట్ర ప్రభుత్వ పరిపాలనలో పారదర్శకత ఎలా సాధ్యం ? ఇదే అంశంపై ఈరోజు ప్రతిధ్వని.
Last Updated : Feb 3, 2023, 8:25 PM IST