PRATIDWANI జన హృదయాలను జయించిన నేతకు భయమెందుకు - oppositions fire on cm jagan tour restrictions
PRATIDWANI ఆయనకేమైంది అసలు. నాడు జనంలో చరించినవాడు. జన హృదయాలను జయించిన వాడు. నేడు జనాన్ని చూసి ఎందుకు జడుస్తున్నారు. ముచ్చటపడి మూడువేల కిలోమీటర్లు జనంతో నడిచిన నేతకు ముచ్చెమటలు పడుతున్నాయా. అనేక అంచెలు దాటి సంచలన విజయాన్ని అందుకున్న నాయకుడికి ఇప్పుడు కంచెలు ఎందుకు అవసరం అయ్యాయి. ఇదీ నాటి ప్రతిపక్షనేత, నేటి ముఖ్యమంత్రి జగన్ గురించి రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్న చర్చ.. ఇదే అంశంపై నేటి ప్రతిధ్వని.
Last Updated : Feb 3, 2023, 8:33 PM IST