Prathidwani: రాజధాని అమరావతిపై సీఎం జగన్‌ది రోజుకో మాట - ప్రతిధ్వని
Prathidwani: అమరావతిలో చోటు చేసుకుంటున్న పరిణామాలు అన్నీ జగన్నాటకాన్ని తలపిస్తున్నాయి. రాజధాని అమరావతిలో ఇన్‌సైడ్ ట్రేడింగ్ జరిగిందంటూ తప్పుడు ఆరోపణలు చేశారు. అధికారంలోకి వచ్చి నాలుగేళ్లయినా ఒక్కటి రుజువు చేయలేదు. తరువాత అమరావతికి ముంపు ప్రమాదం ఉందని కొన్నాళ్లు దుష్ప్రచారం చేశారు. ఒక సామాజిక వర్గం కోసమే అమరావతి రాజధాని అని విష ప్రచారం.. ఇలా పూటకోరీతిగా వైసీపీ ప్రభుత్వం, ఆ పార్టీ నేతలు విషం చిమ్మిన చోటనే.. ముఖ్యమంత్రి చేసిన ప్రసంగమే ఇందుకు కారణం. రాజధానిలో పేదలకు సెంటు స్థలాల్లో ఇళ్ల నిర్మాణ భూమి పూజ సందర్భంగా.. అమరావతిని అందరి రాజధానిగా ప్రకటించారు ముఖ్యమంత్రి జగన్. అంటే.. మరి ఇన్నాళ్లు అమరావతి ఎవరిది? రాష్ట్ర భవిష్యత్ కోసం రాజధాని కోసం ఒక్కపిలుపుతో వేలాది ఎకరాలు ఇచ్చిన ఎస్సీలు, బీసీలు ఎవరు? వారికి జగన్ సర్కార్ చేసిన న్యాయం ఏమిటి? సీఆర్డీఏ ప్రాంతంలో గజం కనీసంలో కనీసం 15 వేలు ఉందని, అంత ఖరీదైన స్థలాన్ని పేదలకు ఇస్తున్నానని సగర్వంగా ముఖ్యమంత్రి చెప్పింది విన్నారు. ఈ నాలుగేళ్లలో అమరావతిని భ్రష్టు పట్టించినా కూడా అంత రేటు పలుకుతుంటే.. వేల ఎకరాల భూమి ఉన్న అమరావతిని అభివృద్ధి చేసి ఉంటే రాజధాని నిర్మాణం ఎందుకు సాధ్యం కాదు? అమరావతి విషయంలో ఏ ఏ సందర్భాల్లో కోర్టు తీర్పులను ఈ ప్రభుత్వం పెడచెవిన పెట్టింది? ఇదే అంశంపై నేటి ప్రతిధ్వని.