PRATHIDWANI ధాన్యం బకాయిల కోసం పడిగాపులెందుకు - ధాన్యం బకాయిలు
కల్లాల వద్దకు వెళ్తే తెలుస్తాయి కష్టాలు. ఆర్బీకేల ద్వారా రాష్ట్రంలో ధాన్యం కొనుగోళ్లు ఎలా జరుగుతున్నాయో అధికార వైకాపా సభ్యులే.. పౌర సరఫరాల శాఖ మంత్రి కారుమూరి నాగ్వేశ్వర రావు దృష్టికి తెచ్చిన అంశం ఇది. అసలు ఎప్పటికప్పుడు ధాన్యం బకాయిల కోసం రైతులు ఆ స్థాయిలో ఎందుకు పడిగాపులు కాయాల్సి వస్తోంది...? ఇదే సమయంలో రైతులకు ఈ-క్రాప్ నమోదు కష్టాలూ తీవ్రస్థాయికి చేరాయని వెల్లువెత్తుతున్న ఫిర్యాదులకు సమాధానం ఎక్కడ? ఓ వైపు రాష్ట్ర ప్రభుత్వం ఏమో రైతులకు సంబంధించి అన్ని విషయాలకు అదే ఆధారం అంటోంది. క్షేత్రస్థాయిలో చూస్తే.. రాష్ట్రంలో ఈ-పంట ప్రారంభించి ఆరేళ్లవుతున్నా ఇప్పటికీ గాడిన పడకపోతే రైతులు ఎవరికి చెప్పుకోవాలి? పంట నష్టానికి పరిహారం అందించడంలో జాప్యానికి అడ్డుకట్ట ఎలా? ఇదే అంశంపై నేటి ప్రతిధ్వని.
Last Updated : Feb 3, 2023, 8:28 PM IST