Prathidwani: మత్స్యకార కుటుంబాలకై ప్రభుత్వం ఏం చేస్తోంది..? - government funds to fishermen
🎬 Watch Now: Feature Video
Prathidwani: మత్స్యకారులకు లభిస్తోన్న భరోసా ఎంత? గతంతో పోల్చితే 6 రెట్లు అధికంగా సాయం అందిస్తున్నాం అంటోంది వైకాపా ప్రభుత్వం. మత్స్యకారులకు గత ప్రభుత్వాలు చేయని విధంగా.. ఆర్థిక లబ్ధి చేకూరుస్తున్నామని ముఖ్యమంత్రి జగన్ అన్నారు. మరి ఆ మేరకు వారంతా సంతోషంగానే ఉన్నారా? ఇవాళ రాష్ట్రంలో సగటు మత్స్యకార కుటుంబాల జీవనస్థితిగతులు ఏమిటి? మత్స్యకార కుటుంబాల్లోని మహిళలు, విద్యార్థులు, యువత విషయంలో ప్రభుత్వం ఏమైనా ప్రత్యేక కార్యక్రమాలు అమలు చేస్తోందా? మత్స్యకారులకు కావాల్సిన వలలు, బాక్సులు, ద్విచక్ర వాహనాలు, బోట్లు ఇతర సరంజామా కొనుగోళ్లలో సాయం ఎలా ఉన్నాయి? శ్రీకాకుళం నుంచి నెల్లూరు వరకు... 9 ఉమ్మడి జిల్లాల్లోని మత్స్యకార కుటుంబాలకు ఇప్పుడు అందాల్సిన తక్షణ సహాయం, భరోసా ఏమిటి? ఇదే అంశంపై నేటి ప్రతిధ్వని చర్చ చేపట్టింది. ఈ చర్చలో రాష్ట్ర మత్స్యకార సంఘం ప్రధాన కార్యదర్శి కొల్లాటి శ్రీనివాసరావు, జాతీయ మత్స్యకార సమాఖ్య రాష్ట్ర మహిళా విభాగం అధ్యక్షురాలు వెంకటలక్ష్మి పాల్గొని తమ అభిప్రాయాలు వెల్లడించారు.