ఆంధ్రప్రదేశ్

andhra pradesh

రాష్ట్రంలో పెరుగుతున్న నేర సంస్కృతి

ETV Bharat / videos

Prathidwani: ప్రజాస్వామ్యమా ? వైఎస్సార్సీపీ ప్రైవేటు సామ్రాజ్యమా..?

By

Published : Jul 6, 2023, 10:26 PM IST

Updated : Jul 6, 2023, 10:32 PM IST

Prathidwani: ఎటు చూసినా.. అశాంతి, అభద్రత... అరాచకాలు.. అసలు ప్రజాస్వామ్యంలోనే ఉన్నామా లేక.. వైఎస్సార్సీపీ ప్రైవేటు సామ్రాజ్యంలో ఉన్నామా..? కొద్ది రోజులుగా రాష్ట్రంలో విపక్షాలు, ప్రజా సంఘాల నుంచి వినిపిస్తోన్న ప్రశ్న ఇది. ఉత్తరాంధ్ర, కోస్తా, రాయలసీమ అనే తేడా లేకుండా అన్ని ప్రాంతాల్లో అధికార పార్టీ పాలనపై ఈ స్థాయి వ్యతిరేకతకు కారణం ఏమిటి? నాలుగేళ్లుగా రాష్ట్రంలో ఏం జరుగుతోంది? అధికార పార్టీ నేతల వేధింపులు, దౌర్జన్యాలపై సామాన్య ప్రజలు, చిరు వ్యాపారులు ఏమనుకుంటున్నారు? పోలీస్ వ్యవస్థ తీరు ఎందుకు తీవ్ర వ్యతిరేకత, వివాదాలకు కేంద్రబిందువుగా మారుతోంది? ఉమ్మడి గుంటూరు జిల్లా పరిధిలోనే... అధికార వైఎస్సార్సీపీ నాయకుల తీరు అనేక సందర్భాల్లో పతాక శీర్షికల్లో నిలిచింది. నిలుస్తోంది. ఈ నాలుగేళ్లలో అక్కడేం జరిగింది? స్థానిక ఎన్నికలు కావొచ్చు.. కాంట్రాక్టులు కావొచ్చు.. ఇసుక, మైనింగ్ వ్యాపారాలు కావొచ్చు.. నెల్లూరు నుంచి సీమ దాకా పరిస్థితి ఎలా ఉంది? కాకినాడ తీరం నుంచి వంశధార తీరం వరకు.. వైకాపా వేధింపులు ఎలా ఉన్నాయి? సామాన్య ప్రజలు, చిన్నవ్యాపారులు ఏమనుకుంటున్నారు? విపక్షాలు, ప్రజాసంఘాలపై ఏపీ పోలీసుల అణచివేతకు ప్రతి ఒక్కరూ బాధితులే. కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా కూడా రాష్ట్రంలో అరాచక పాలన సాగుతోందన్నారు. ఈ ప్రభుత్వంపై ఛార్జ్‌షీట్ కార్యక్రమం ఎంత వరకు వచ్చింది? ఇదే అంశంపై నేటి ప్రతిధ్వని.

Last Updated : Jul 6, 2023, 10:32 PM IST

ABOUT THE AUTHOR

...view details