Prathidwani: డిమాండ్ల సాధనకు విద్యుత్ ఉద్యోగుల పోరుబాట
Prathidwani: రాష్ట్రంలో విద్యుత్ ఉద్యోగులు ఉద్యమపథం పట్టారు. సమస్యలు పరిష్కరించకుంటే ఆగస్టు 10 నుంచి నిరవధిక సమ్మెకు వెళ్తామని రాష్ట్ర విద్యుత్ ఉద్యోగుల జేఏసీ ప్రతినిధులు ప్రకటించారు. కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల దశలవారీ క్రమబద్ధీకరణపై హామీల అమలుతో పాటు.. గ్రామ సచివాలయాల్లో జేఎల్ఎం గ్రేడ్- 2 ఉద్యోగుల క్రమబద్ధీకరణ, పెండింగ్‌లోని కారుణ్య నియామకాలు.. మరికొన్ని డిమాండ్ల సాధనకే పోరుబాట పట్టినట్లు వెల్లడించారు. 4 సంవత్సరాలుగా విద్యుత్ శాఖలోని పెండింగ్ అంశాలపై పలుమార్లు విన్నవించినా స్పందించలేదని.. విద్యుత్ ఉద్యోగుల జేఏసీ ప్రతినిధులు ఆందోళన వ్యక్తం చేశారు. అసలు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పడు జగన్ వారికిచ్చిన హామీలు ఏమిటి? అధికారంలోకి వచ్చిన ఈ నాలుగేళ్లలో వారికి ఏం చేశారు? నాడు జగన్ పాదయాత్రలో అనేక మీటింగ్‌లలో ఆయన విద్యుత్ ఉద్యోగుల సమస్య గురించి చెప్పారు. మీరూ దఫదఫాలుగా వినతిపత్రాలు ఇచ్చారు. అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ సమస్యల పరిష్కారంపై ఏమైనా సంప్రదింపులు జరిగాయా? ఇదే అంశంపై నేటి ప్రతిధ్వని.