ఆంధ్రప్రదేశ్

andhra pradesh

prathidwani

ETV Bharat / videos

PRATHIDWANI: భక్తుల సొమ్ము మహా యజ్ఞానికి ఎలా..? - ఆలయాల అభివృద్ధి

By

Published : May 2, 2023, 9:25 PM IST

రాష్ట్రంలో దేవాదాయశాఖ తీరు మరోసారి చర్చనీయాంశం అవుతోంది. దానికి కారణం.. భక్తులు, దాతలు ఇచ్చిన సొమ్మును ఓ మహాయజ్ఞానికి వినియోగించేందుకు ఆ శాఖ సిద్ధమవుతూ ఉండడం. దేవాదాయశాఖ ఆధ్వర్యంలో విజయవాడలో ఈ నెల 12 నుంచి 17 వరకు నిర్వహించ తలపెట్టిన చండీ రుద్ర రాజశ్యామల సుదర్శన సహిత శ్రీమహాలక్ష్మి యజ్ఞానికి ప్రధాన ఆలయాల నిధులు వినియోగించనున్నారన్న సమాచారంపై హిందూ ధార్మిక సంఘాలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. హుండీలో భక్తులు వేసిన సొమ్ము, విరాళంగా దాతలు ఇచ్చిన డబ్బు ఆయా ఆలయాల అభివృద్ధికి వినియోగించాల్సి ఉండగా.. దాన్ని మహా యజ్ఞానికి వినియోగించడం ఏంటన్న చర్చ జరుగుతోంది. ఇదే సమయంలో రాష్ట్రవ్యాప్తంగా దేవాలయాల ఆస్తులు, భూముల నిర్వహణపైనా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇదే అంశంపై నేటి ప్రతిధ్వని చర్చ చేపట్టింది. ఈ చర్చలో హిందూ దేవాలయ పరిరక్షణ సమితి వ్యవస్థాపకులు స్వామి కమలానంద భారతి, ఆర్‌ఎస్‌ఎస్ సంఘటన్ జాతీయ అధికార ప్రతినిధి,  తురగా శ్రీరామ్ పాల్గొని తమ అభిప్రాయాలు వెల్లడించారు. 

ABOUT THE AUTHOR

...view details