ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / videos

PRATHIDWANI: సినిమాల నిర్మాణం నిలిచిపోతే నష్టమెవరికి? సమస్యకు పరిష్కారం ఎలా? - telugu movies

By

Published : Aug 1, 2022, 9:48 PM IST

Updated : Feb 3, 2023, 8:25 PM IST

సినిమా షూటింగ్‌లు నిలిపేయాలని తెలుగు చలనచిత్ర వాణిజ్య మండలి నిర్ణయించింది. ఈ మేరకు నేటి నుంచి నలభై సినిమాల చిత్రీకరణ పనుల్లో ప్రతిష్టంభన ఏర్పడింది. భారీ బడ్జెట్లతో నిర్మిస్తున్న సినిమాలు థియేటర్లలో ప్రేక్షకుల ఆదరణకు నోచుకోక చతికిలబడుతున్నాయి. ఒకవైపు నటీనటుల పారితోషికాలు, అదనపు ఖర‌్చులు భారీగా పెరిపోతుంటే.. ఇంకోవైపు ఓటీటీ ప్లాట్‌ ఫాంల నుంచి ఎదురవుతున్న పోటీ నిర్మాతల పాలిట గుదిబండగా మారింది. అయితే.. వేలాది మంది కార్మికులకు ఉపాధి కల్పిస్తున్న సినిమాల నిర్మాణం నిలిచిపోతే ఎవరికి నష్టం? కార్మికుల వేతనాలు, టికెట్ల ధరలు, వర్చువల్ ప్రింట్ రుసుములపై పరిశ్రమ వర్గాల్లో ఉన్న భిన్నాభిప్రాయాలు ఏంటి? షూటింగ్‌లు నిలిపేస్తే సమస్యలు పరిష్కారం అయ్యేదెలా? ఇదే అంశంపై ఈ రోజు ప్రతిధ్వని.
Last Updated : Feb 3, 2023, 8:25 PM IST

ABOUT THE AUTHOR

...view details