PRATHIDWANI పాఠశాల విద్య బాగు కోసం ఇప్పుడేం చేయాలి - రాష్ట్రంలో డీఎస్సీ ఎప్పుడు
పాఠం చెప్పేది ఎవరు.. రాష్ట్రంలో పాఠశాల విద్యకు సంబంధించి కొంతకాలంగా వినిపిస్తోన్న ప్రశ్న ఇది. అది కేవలం విమర్శ మాత్రమే కాదు.. ఇప్పుడు పార్లమెంట్ సాక్షిగా కేంద్రప్రభుత్వం వెల్లడించిన వాస్తవం. ఒకటో రెండో కాదు... అక్షరాల 50వేల 677 ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉన్నాయి రాష్ట్రంలో. ఇదే విషయంలో చాలాకాలంగా విద్యావేత్తలు, ఉపాధ్యాయ సంఘాలు కూడా పనిభారం, బోధన నాణ్యతపై ప్రభావం పడుతోందని ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. మరి ఈ విషయంలో వైకాపా పెద్దలు ప్రతిపక్షంలో ఉండగా ఇచ్చిన హామీలు ఏమిటి.. అధికారంలోకి వచ్చిన ఈ మూడున్నరేళ్లలో ఏం చేశారు.. పాఠశాల విద్య బాగుకోసం ఇప్పుడు జరగాల్సింది ఏమిటి.. ఇదే అంశంపై నేటి ప్రతిధ్వని.
Last Updated : Feb 3, 2023, 8:36 PM IST