PRATHIDWANI అబార్షన్లలో తేడా చూపించడం రాజ్యాంగ విరుద్ధమన్న సుప్రీంకోర్టు - ప్రతిధ్వని
మహిళా హక్కుల విషయంలో మరో కీలకతీర్పును వెలువరించింది.. దేశ సర్వోన్నత న్యాయ స్థానం. చట్టపరంగా మహిళలు అందరకీ..సురక్షితంగా అబార్షన్లు చేయించుకునే హక్కు ఉందని.. ఇందులో వివాహితులు, అవివాహితులు అంటూ తేడా చూపించడం రాజ్యాంగవిరుద్ధమని స్పష్టం చేసింది. ఈ సందర్భంగా వైవాహిక అత్యాచారాన్ని కూడా కోర్టు ప్రస్తావించింది. బలవంతపు గర్భధారణ నుంచి మహిళలను కాపాడాల్సిన అవసరం ఉందని పేర్కొంది. అబార్షన్ హక్కు కోసం ప్రపంచవ్యాప్తంగా ఉద్యమాలు జరుగుతున్న తరుణంలో.. వచ్చిన ఈ తీర్పు అందర్ని దృష్టిని ఆకర్షించింది. అసలు ఈ వివాదం నేపథ్యం ఏమిటి? రానున్న రోజుల్లో ఇంకా అధిగమించాల్సిన సవాళ్లు ఏమిటి? ఇదే అంశంపై నేటి ప్రతిధ్వని.
Last Updated : Feb 3, 2023, 8:28 PM IST